దుండిగల్, ఫిబ్రవరి 27 : ఆటోడ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించి, ప్రయాణికులతో పాటు వారు సురక్షితంగా ఇంటికి చేరుకోవాలని మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి, ఎంఎల్ఆర్ఐటీ కళాశాల కార్యదర్శి మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. రోడ్డు సేఫ్టీ కార్యక్రమం లో భాగంగా ఎంఎల్ఆర్ఐటీ ట్రాక్స్ ఎన్జీవో, మర్రి అరుంధతి వైద్యశాల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఎల్ఆర్ఐటీ) ప్రాంగణంలో ఆదివారం పలువురు ఆటోడ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మర్రి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆటోడ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్తలు తీసు కోవాలన్నారు. అదే సమయంలో ఆటోడ్రైవర్లు, వారి కుటుంబసభ్యులు క్రమం తప్పకుండా ఆరోగ్యపరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అరుంధతి వైద్యశాల డీన్ డా.ఉదయ్‌కుమార్, ఎంఎల్ఆర్ఐటీ కళాశాల ప్రిన్సిపాల్ డా. శ్రీనివాసరావు, ట్రాక్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధి ఆదిశంకర్, కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రతినిధి ఉదయ్రంజన్, ఆటోయూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మారన్న, టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌తో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.