చిక్కడపల్లి, ఫిబ్రవరి 27 : మంచి నీటి, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధికి కలిసి కట్టుగా కృషి చేస్తామని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం గాంధీనగర్ డివిజన్లోని సాయికృప అపార్ట్మెంట్ లేన్‌లో రూ. 38.70 లక్షలతో నూతనంగా మంచినీటి, డ్రైనేజీ పైపులైన్ల అభివృద్ధి నిర్మాణ పనులను ఎమ్మెల్యే ముఠా గోపాల్, స్థానిక కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్‌లతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో ప్రజల సహకారంతోనే మంచినీటి, డ్రైనేజీ సమస్యలు పరిష్కారం అవుతున్నాయని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జనాభాకు అనుగుణంగా నూతన మంచినీటి, డ్రైనేజీ పైపులైన్లు అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో మంచినీటి డ్రైనేజీ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్, మాజీ కార్పొరేటర్ ముఠా పద్మానరేశ్, టీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, పార్టీ సీనియర్ నాయకుడు ముఠా నరేశ్, పార్టీ డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాఖేశ్, శ్రీకాంత్, నాయకులు ముచ్చకుర్తి ప్రభాకర్ ఎర్రంశ్రీనివాస్ గుప్తా, మారిశెట్టి నర్సింగ్‌రావు, గుండు జగదీశ్ బాబు, గడ్డమీది శ్రీనివాస్, రవి శంకర్ గుప్తా, పున్న సత్యనారాయణ, ముఠా శివసింహ, ఎస్టీ ప్రేమ్, ముచ్చకుర్తి పద్మ, తుడుం లక్ష్మి, జహంగీర్, బీజేవైఎం నగర మాజీ అధ్యక్షుడు ఎ.వినయ్‌కుమార్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.