జూబ్లీహిల్స్, ఫిబ్రవరి 27: యూసుఫ్‌గూడ సర్కిల్లోని శ్రీరాంనగర్, వినాయక్‌నగర్, బోరబండ పీహెచ్‌సీల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, సామాజిక భవనాల్లో ఐదేండ్లలోపు పిల్లలకు ఆదివారం చుక్కల మందు పంపిణీ చేశారు. శ్రీరాంనగర్ పీహెచ్సీ పరిధిలోని 40 కేంద్రాల్లో 7655 మంది చిన్నారులకు, వినాయక్‌నగర్ పీహెచ్సీ పరిధిలోని 36 కేంద్రాల్లో 6659 మంది చిన్నారులకు, బోరబండ పీహెచ్సీ పరిధిలోని 45 కేంద్రాల్లో 7922 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ జువేరియా బేగం, డాక్టర్ అశ్రిత, డాక్టర్ శ్రీవల్లి ఆధ్వర్యంలో వైద్య బృందాలు పనిచేశాయి. శ్రీరాంనగర్ క్లస్టర్లో ఏర్పాటు చేసిన 208 పల్స్ పోలియో కేంద్రాల్లో 38,389 చిన్నారులకు చుక్కల మందు పంపిణీ చేసినట్లు ఎస్పీహెచ్ఓ డాక్టర్ అనురాధ తెలిపారు.
చిన్నారుల నిండు జీవితానికి..
పల్స్ పోలియో చుక్కలు చిన్నారుల నిండు జీవితానికి దోహద పడతాయని రాంగోపాల్‌పేట్ డివిజన్ కార్పొరేటర్ చీర సుచిత్ర అన్నారు. పల్స్ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం రాంగోపాల్‌పేట్, బేగంపేట్ డివిజన్లలో విజయవంతంగా నిర్వహించారు. డివిజన్లోని పాల్‌దాస్ ఆస్పత్రి, బేగంపేట్ డివిజన్లోని పట్టణ ఆరోగ్య కేంద్రాలతో పాటు ఆయా కేంద్రాల్లో పిల్లలకు పోలియో చుక్కలు పంపిణీ చేశారు. కార్పొరేటర్లు చీర సుచిత్ర, మహేశ్వరి పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, సిబ్బందితో పాటు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిగూడలో పల్స్ పోలియో..
పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఎల్లారెడ్డిగూడలో ఐదేండ్ల లోపు చిన్నారులకు దవాఖాన సిబ్బంది పోలియో చుక్కలు వేశారు. డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు అప్పుఖాన్, నేతలు తన్నుఖాన్, మధుయాదవ్, శరత్‌గౌడ్, నర్సింగ్, రవి, అంగన్వాడీ కార్యకర్తలు సిబ్బందికి సహకరించారు. కృష్ణవేణి హైస్కూల్లో జరిగిన పల్స్ పోలియోలో ఏఎన్ఎం విజయకుమారి, ఆశ వర్కర్ మణి సేవలందించారు.