జూబ్లీహిల్స్, ఫిబ్రవరి 27 : ప్రజల కోసం పుట్టిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అని.. కన్నతల్లిలాంటి పార్టీ కోసం కష్టపడే వారికి సముచిత స్థానం దక్కుతుందని టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఆదివారం రహ్మత్‌నగర్ డివిజన్ శ్రీరాంనగర్‌కు చెందిన మహ్మద్ నజీర్, మహ్మద్ షఫీక్‌లతో పాటు 400మంది యువకులు ఎమ్మెల్యే మాగంటి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ సీఎన్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పేదల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో యువత టీఆర్ఎస్ పార్టీవైపు ఆకర్శితులవుతున్నారని అన్నారు. కార్యక్రమంలో శ్రీనగర్‌కాలనీ టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు అప్పూఖాన్, తన్నూఖాన్, రహ్మత్‌నగర్ డివిజన్ అధ్యక్షుడు మహ్మద్ మన్సూర్, తదితరులు పాల్గొన్నారు.
మతసామరస్యానికి ప్రతీక తెలంగాణ
మతసామరస్యానికి ప్రతీకగా తెలంగాణ నిలిచిందని టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పేర్కొన్నారు. రహ్మత్‌నగర్ డివిజన్ కార్మికనగర్లోని గౌసియా ఆజం దస్తగిరి దర్గాలో ఆదివారం నిర్వహించిన గ్యార్వీ షరీఫ్‌లో కార్పొరేటర్ సీఎన్ రెడ్డితో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మన్సూర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, సీనియర్ నాయకులు బషీర్, సాబేర్, రవిశంకర్, గఫోర్, సొహైల్ తదితరులు పాల్గొన్నారు.