మేడ్చల్ జోన్ బృందం, ఫిబ్రవరి 27 : ఆరోగ్యవంతమైన సమాజానికి కృషి చేయాలని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు.మేడ్చల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహించారు. ఘట్కేసర్ మండల పరిధిలోని ప్రతాపిసంగారంలో జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి చిన్నారులకు చుక్కలు వేసి పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. 0-5 సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ సూచించారు. మేడ్చల్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఎంపీపీ రజితారాజమల్లారెడ్డి, జడ్పీటీసీ శైలజావిజయానందారెడ్డి, కీసరలో ఎంపీపీ ఇందిరలక్ష్మీనారాయణ, ఉమ్మడి శామీర్‌పేట మండలంలో ఎంపీపీలు ఎల్లూబాయిబాబు, హారిక, ఘట్కేసర్ మండలంలో ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలు గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
మేడ్చల్, గుండ్లపోచంపల్లి, మున్సిపాలిటీల్లో చైర్పర్సన్లు దీపికా నర్సింహా రెడ్డి, మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి, ఘట్కేసర్ మున్సిపాలిటీలో చైర్పర్సన్ ఎం.పావనీ జంగయ్య యాదవ్, పోచారం మున్సిపాలిటీలో చైర్మన్ బి.కొండల్‌రెడ్డి చిన్నారులకు చుక్కలు వేశారు.
తూంకుంట మున్సిపాలిటీలో చైర్మన్ రాజేశ్వర్‌రావు, నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల్లో చైర్మన్లు చంద్రారెడ్డి, ప్రణీత శ్రీకాంత్ గౌడ్ పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమంలో ఆయా మున్సిపాలిటీల వైస్ చైర్మన్లు ప్రభాకర్, మాధవ రెడ్డి, మల్లేశ్, నరేందర్ రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
బోడుప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మేయర్ బుచ్చిరెడ్డి, పీర్జాదిగూడ పరిధిలో మేయర్ వెంకట్‌రెడ్డి, జవహర్‌నగర్ ప్రభుత్వ దవాఖానలో మేయర్ కావ్య చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు కొత్త లక్ష్మీరవిగౌడ్, కుర్ర శివకుమార్‌గౌడ్, రెడ్డిశెట్టి శ్రీనివాస్, కార్పొరేటర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.