ఉప్పల్జోన్ బృందం, ఫిబ్రవరి 27 : పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఉప్పల్, చర్లపల్లి, రామంతాపూర్, మల్లాపూర్, కాప్రా, హెచ్‌బీకాలనీ, డివిజన్లు, ఏఎస్‌రావునగర్, కుషాయిగూడ ఆరోగ్య కేంద్రాలు, కాలనీలు, బస్తీల్లో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాల్లో ఎమ్మెల్యేతోపాటు ఆయా డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఆయా కార్యక్రమాల్లో కార్పొరేటర్లు శిరీషాసోమశేఖర్రెడ్డి, దేవేందర్‌రెడ్డి, ప్రభుదాస్, బొంతు శ్రీదేవి, స్వర్ణరాజు, మెడికల్ సూపర్వైజర్ బోగ ప్రకాశ్, డీపీహెచ్‌ఓ శేషు పద్మ, వైద్యులు సౌందర్యలత, స్వప్నిక, స్వప్న, పూజ, టీఆర్ఎస్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్‌రెడ్డి, గరిక సుధాకర్, కొత్త రామారావు, శేర్ మణెమ్మ, బేతాల బాల్‌రాజు, గరిక సుధాకర్, లక్ష్మీనారాయణ, ఏనుగు సీతారామిరెడ్డి, రమేశ్ చారి, రాజి రెడ్డి, యాదగిరి, చిన్న, గుమ్మడి యాకయ్య, మొగుల య్య, శిరీషారెడ్డి, శోభారెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి, వాసుగౌడ్, శ్రీని వాస్‌రెడ్డి, సుడుగు మహేంద్రారెడ్డి, కొప్పుల కుమార్, రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.