మల్కాజిగిరి, ఫిబ్రవరి 26: కరోనా నివారణకు ప్రభుత్వం చేపట్టిన ఇంటింటికీ జ్వర సర్వే మల్కాజిగిరి నియోజకవర్గంలో ముమ్మరంగా కొనసాగుతున్నది. ఫిబ్రవరి 3నుంచి 24వరకు మల్కాజిగిరి, అల్వాల్ సర్కిళ్ల పరిధిలో ఆరోగ్యశాఖ సిబ్బందితో పాటు మున్సిపల్ సిబ్బంది 1,47,141ఇండ్లలో జ్వర సర్వే నిర్వహించి.. స్వల్ప లక్షణాలు ఉన్న 2,231మందికి జ్వర నివారణ మెడికల్ కిట్లను అందజేశారు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పడుతున్నదని.. అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించి.. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.
ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం..
ప్రజల ఆరోగ్యమే లక్ష్యం గా ప్రభుత్వం పనిచేస్తున్నది. కరోనా అనుమానితులను గుర్తించడానికి చేపట్టిన జ్వరసర్వే మంచి ఫలితాలు ఇ చ్చాయి. 21రోజుల్లో 1,47,141ఇండ్లలో జ్వర సర్వే చేసి.. 2,231మంది అ నుమానితులకు కిట్స్‌ను అందజేశారు. పేదల ఆరోగ్యం కాపాడడానికి ప్రభు త్వం బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసింది. వ్యాధి తగ్గుముఖం పట్టినా.. అందరూ అప్రమత్తంగా ఉండాలి. 15 సంవత్సరాలపైన ఉన్నవారు కరోనా టీకాలు తీసుకోవాలి.
– మైనంపల్లి హన్మంతరావు, ఎమ్మెల్యే