సమస్యల పరిష్కారానికే బస్తీబాట
తాగునీటి, సీవరేజీ సమస్యల పరిష్కారానికి జలమండలి అధికారులు బస్తీబాట పట్టారు. సమస్యల రహిత సెక్షన్లుగా మార్చేందుకు స్థానిక నాయకులతో, ప్రజలతో మమేకమై పనులు చేపడుతున్నారు. జలమండలి డివిజన్-6 జనరల్ మేనేజర్ హరిశంకర్ ఆధ్వర్యంలో చేపడుతున్న బస్తీ పర్యటనకు విశేష స్పందన వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.
జూబ్లీహిల్స్,ఫిబ్రవరి19: తాగునీటి, సీవరేజీ సమస్యల పరిష్కారానికి జలమండలి అధికారులు బస్తీబాట పట్టారు. సమస్యల రహిత సెక్షన్లుగా మార్చేందుకు స్థానిక నాయకులతో, ప్రజలతో మమేకమై పనులు చేపడుతున్నారు. జలమండలి డివిజన్-6 జనరల్ మేనేజర్ హరిశంకర్ ఆధ్వర్యంలో చేపడుతున్న బస్తీ పర్యటనకు విశేష స్పందన వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రజల సమస్యల సత్వర పరిష్కారంతో పాటు మెరుగైన సేవలందించేందుకు ఈ కార్యక్రమం తోడ్పడుతుందని భావిస్తున్నారు. అంతేకాక ప్ర భుత్వం ప్రవేశపెట్టిన 20 వేల లీటర్ల ఉచిత తాగునీటి పథకంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అధికారులు పేర్కొంటున్నారు. ఇటీవల పూర్తిగా తొలగిపోయిన తాగునీటి ఎద్దడి.. ఆధునిక యంత్రాలతో వేగంగా సీవరేజీ సమస్యల పరిష్కారం.. తదితర పనులపై ప్రజలనుంచి సానుకూల స్పందన వస్తుందని తెలుపుతున్నారు.
ఇందులో భాగంగా ఆయా ప్రాంతాల్లో అధికారులు ప్రతిరోజు కొద్ది సమయం ప్రజలతో కలవడం ద్వారా వారికి ఎదురవుతున్న సమస్యలు తెలుస్తాయని.. తద్వారా వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలుపుతున్నారు. శనివారం రహ్మత్‌నగర్ డివిజన్ హబీబ్ఫాతిమానగర్లో మేనేజర్ శ్యామ్‌కుమార్ నాయకుడు షరీఫ్‌తో కలిసి బస్తీ బాట చేపట్టారు. ఎస్పీఆర్ హిల్స్ సెక్షన్ పరిధిలోని టి.అంజయ్యనగర్ ఫేస్-1, ఫేస్-2 లలో మేనేజర్ రాజేందర్ నాయకులతో కలిసి పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

