మహేశ్వరం, ఫిబ్రవరి 18: శివరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం నగరంలోని మంత్రి కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్‌రెడ్డి, దేవాలయ చైర్మన్ నిమ్మగూడెం సుధీర్‌గౌడ్ ఇతర అధికారులతో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాలకు అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. నాలుగు రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలకు భక్తులు ఎక్కువగా వచ్చే వీలుందని, ఏర్పాట్లను ముమ్మరం చేయాలని సూచించారు. పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఏర్పాట్లు ఉండాలన్నారు. పారిశుధ్యం, నీటిసరఫరా, పోలీసు, వైద్యశాఖ అధికారులు బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు నిరంతరాయంగా తమ సేవలను అందించాలని అన్ని శాఖల అధికారులకు సూచించారు. అనంతరం దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ముద్రించిన గోడ పత్రిక, కర పత్రాలను మంత్రి ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఎంపీపీ రఘుమారెడ్డి, ఎంపీడీవో నర్సింహులు, సీఐ మధుసూదన్, ఈవో మురళీకృష్ణ, మాజీ సర్పంచ్ ఆనందం, నాయకులు కరోళ్ల చంద్రయ్య, నవీన్, యాదగిరిగౌడ్, కంది రమేశ్, దోమ శ్రీనివాస్‌రెడ్డి, అశోక్‌కుమార్, కుమార్, శ్రీను, కృష్ణ, రాజు యాదవ్, శ్రీనివాస్, మైసయ్య, చందు, తదితరులు పాల్గొన్నారు.
పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
ఆర్కేపురం : పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం సరూర్‌నగర్ తాసీల్దార్ కార్యాలయంలో 26 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, ఆశవర్కర్లకు స్మార్ట్ ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ…రాష్ట్రంలో 10 లక్షల మందికి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1142 ఆశ వర్కర్లకు 26 వేల స్మార్ట్ ఫోన్లను అందజేసినట్లు తెలిపారు. ఆశ వర్కర్ల సేవలను గుర్తించి సీఎం కేసీఆర్ వారి వేతనాలు పెంచినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి, కందుకూరు ఆర్డీఓ వెంకటాచారి, తాసీల్దార్ రామ్మోహన్, కార్పొరేటర్ పారుపల్లి అనితా దయాకర్‌రెడ్డి, నాయకులు బేర బాలకిషన్, ఆకుల అరవింద్‌కుమార్, కొండల్‌రెడ్డి, పెండ్యాల నగేశ్, మురుకుంట అరవింద్ తదితరులు పాల్గొన్నారు.