సిటీబ్యూరో, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): విద్యా, వైద్యం, సాంకేతిక రంగాల్లో అధునాతన ఆవిషరణలను ప్రోత్సహిస్తున్న తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) పదో వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం టీ హబ్‌లో ఘనంగా జరిగాయి. పురుగు మందుల పిచికారీలో సమస్యలు తొలగించేందుకు డ్రోన్స్ ఎక్స్‌ను టీటా సభ్యులు నరేశ్,అరుణ్‌లు రూపొందించారని తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) అధ్యక్షుడు సందీప్ మక్తల తెలిపారు.
ఆకట్టుకున్న డ్రోన్ పరేడ్..
డ్రోన్ వ్యవస్థలోని నూతన ఆవిషరణలకు చెందిన డ్రోన్ పరేడ్ టీహ బ్ 2.0లో జరిగింది. వివిధ రకాల ఆవిష్కరణలను ఇందులో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ , టీ హబ్ సీఈఓ శ్రీనివాస్, టీఎస్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ శాంత టౌటం, ఐ హబ్ సీఈఓ విజయ్, టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తల హాజరయ్యారు. అనంతరం టీటా పదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నగర శివారు ప్రాంతాల్లో ఉన్న పలు ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన విద్యార్థులు టీ హబ్‌ను సందర్శించే అవకాశాన్ని కల్పించారు.