సిటీబ్యూరో, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): ఫ్యూచరిస్టిక్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్స్ విద్యాసంస్థల అనుబంధ శాఖ క్రీక్ ప్లానెట్ సీడ్స్ మార్స్, సీడ్స్ యురేనస్ పాఠశాల చందానగర్ పీజేఆర్ స్టేడియంలో ‘సంగం’ పేరుతో పాఠశాల వార్షికోత్సవాన్ని నిర్వహించింది. ముఖ్యఅతిథులుగా ఆల్ ఇండియా రేడియో మాజీ డిప్యూటీ డైరెక్టర్ శైలజసుమన్, మేధ లాంగ్వేజ్ థియేటర్ వ్యావస్థాపకుడు డాక్టర్ ఎ.చిరంజీవి హాజరయ్యారు. కార్యక్రమంలో విద్యాసంస్థల చైర్మన్ శీనయ్య, వైస్ చైర్మన్ టి.పాండురంగాచారి, మేనేజింగ్ డైరెక్టర్ నరేంద్రప్రసాద్, అకాడమిక్ హెడ్ డాక్టర్ జయశ్రీనాయర్, వాణి లంక, షణ్ముగవల్లి పాల్గొన్నారు. ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ థీమ్పై విద్యార్థులు ప్రదర్శించిన సాంసృతిక కార్యక్రమాలు అలరించాయి.