రవీంద్రభారతి, అక్టోబర్ 17 : ఉమ్మడి రాష్ట్రంలో కవులు, కళాకారులు నిర్లక్ష్యానికి గురయ్యారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ వారిని ప్రోత్సహిస్తున్నారని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. రవీంద్రభారతిలో ప్రాజ్ఞిక ఫౌండేషన్, ప్రాజ్ఞిక ఆర్ట్స్ అకాడమి, సీల్వెల్ కార్పొరేషన్, కేవీఎల్ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో విశేష సేవలందిస్తున్న జర్నలిస్టులకు మీడియా ఎక్సెలెన్సీ అవార్డుల ప్రధాన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ముఖ్య అతిథిగా హాజరై అవార్డులను ప్రదానం చేశారు. అదేవిధంగా టీఎన్జీఓ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్ హుస్సేనీకి సేవా భూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేసి ఘనంగా సన్మానించారు. అనంతరం హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ దేశంలో గుజరాత్‌ను మించిన అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నదని తెలిపారు.
కరోనా సమయంలో అనేక ఇబ్బందులకు గురవుతూనే విధులు నిర్వహించిన జర్నలిస్టులకు మీడియా ఎక్సలెన్సీ అవార్డులను అందజేయడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజ్ఞిక ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రవీణ్, సీల్వెల్ కార్పొరేషన్ సీఎండీ బండారు సుబ్బారావు, కేవీఎల్ ఫౌండేషన్ చైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త, నవాబుపేట మండల ఉపాధ్యక్షుడు కౌకుంట్ల బందయ్య గౌడ్, సోషల్ యాక్టివిస్ట్ కళాబంధు శరత్‌బాబు, టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్, ప్రముఖ సంఖ్యా శాస్త్ర నిపుణులు దైవజ్ఞ శర్మ, వంశీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వంశీ రామరాజు, తదితరులు పాల్గొన్నారు.
అవార్డులు అందుకున్న వారు..!
ఎస్.కవిత (టీ న్యూస్), కుందవరం విజయచంద్రిక (ఏబీఎన్ ఆంధ్రజ్యోతి), బి.రాజేశ్వరి (స్వతంత్ర టీవీ), జ్యోత్స్న నిదీశ్ (హెచ్ఎం టీవీ), గీతాంజలి (సుమన్ టీవీ), చిట్టోజు జ్యోతి (ఈ టీవీ), గిరిజ రేపల్లి (సీవార్ న్యూస్), గాయిత్రి సాధనాల (జీ తెలుగు), పాడె పద్మ (స్టూడియో ఎన్), సౌమ్య (టీవీ 5), ప్రసన్నా దేవి (భారత్ టుడే టీవీ), మెరుగు రీనా (యాదాద్రి జిల్లా ఫ్రీ లాన్సర్)