మల్కాజిగిరి, అక్టోబర్ 17: దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకొని, పేదలు ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. సోమవారం మచ్చ బొల్లారం డివిజన్, బృందావన్‌కాలనీలో దళిత బంధు కింద మంజూరైన షాపును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దళిత బంధు ద్వారా రూ.10లక్షలతో యూనిట్లను మంజూరు చేశామని అన్నారు. ఇప్పటికే వంద యూనిట్లు నడుస్తున్నాయని, మరో ఐదు వందల మందిని ఎంపికచేస్తామని అన్నారు. దళితబంధు పథకంలో పార్టీలకు అతీతంగా ఎంపిక చేస్తున్నామని అన్నారు. ఈ పథకం కింద మంజూ రైన యునిట్లతో యువతకు ఉపాధి కల్పిస్తున్నామని అన్నారు. మునుగోడు ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు బొబ్బిలి సురేందర్‌రెడ్డి, పరమేశ్, శ్రీనివాస్‌గౌడ్, శ్రీశైలం, కృష్ణ, శ్రావణ్, శోభన్‌బాబు, వెంకటేశ్, షేక్ మహమ్మద్, షేక్ నూర్, షేక్ అజ్మత్, రఫీక్, బాషా, రహమత్ తదితరులు పాల్గొన్నారు.