కీసర, అక్టోబర్ 17: కీసరగుట్ట ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సోమవారం గర్భాలయంలో స్వామివారికి మంత్రి మల్లారెడ్డి అభిషేకం నిర్వహించారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ చైర్మన్ ఉమాపతిశర్మ, ఆలయ కార్యనిర్వహణాధికారి సుధాకర్‌రెడ్డి మంత్రిని శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆలయ కమిటీ సభ్యులు ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.అంతకు ముందు మంత్రికి ఆలయ చైర్మన్ ఉమాపతిశర్మ, కార్యనిర్వహణాధికారి సుధాకర్‌రెడ్డి, వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
కార్యక్రమంలో ఎంపీపీ ఇందిరలక్ష్మీనారాయణ, సర్పంచ్ మాధురి వెంకటేశ్, ఎంపీటీసీ నారాయణశర్మ, మండల పార్టీ అధ్యక్షులు సుధాకర్‌రెడ్డి, ఆలయ రెనోవేషన్ కమిటీ సభ్యులు బి.రమేశ్‌యాదవ్, ఆర్. శ్రావన్‌కుమార్ గుప్త, మల్లారెడ్డి, రామిడి బాల్‌రెడ్డి, అంజయ్యగౌడ్, భాగ్యలక్ష్మి, బుచ్చిరెడ్డి, సాయినాథ్‌గౌడ్, బీఆర్ఎస్ నేతలు ఆర్. ప్రభాకర్‌రెడ్డి, వెంకటేశ్ ముదిరాజ్, భానుశర్మ, బి. రమేశ్‌గుప్త, ఎం. జంగయ్యయాదవ్,ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు రమేశ్‌శర్మ,భక్తులు పాల్గొన్నారు.