ఉప్పల్ / రామంతాపూర్, అక్టోబర్ 14 : కాలనీల అభివృద్ధే ధ్యేయంగా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో అభివృద్ధి పనులను శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. అభివృద్ధి, సంక్షేమంలో నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలుపుతామని చెప్పారు. హబ్సిగూడలోని స్ట్రీట్ నం.1లో రూ.42 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులను కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీశ్‌తో కలిసి ప్రారంభించారు. అదేవిధంగా ఉప్పల్ గణేశ్‌నగర్‌లో సీడీపీ నిధుల నుంచి రూ.11 లక్షల వ్యయంతో చేపట్టిన ఎస్‌డబ్ల్యూజీ పైపులైన్, సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. విద్యుత్, యూజీడీ, మ్యాన్‌హోల్స్, రోడ్లు, తదితర సమస్యలు పరిష్కరించడానికి నిధులు తీసుకువస్తున్నామని తెలిపారు. ఏఈ చంద్రశేఖర్, నేతలు జనంపల్లి వెంకటేశ్వర్‌రెడ్డి, గడ్డం రవికుమార్, డివిజన్ అధ్యక్షుడు వేముల సంతోష్‌రెడ్డి, అన్య వెంకటేశ్, గణేశ్‌నగర్ కాలనీ అధ్యక్షుడు సురవి సత్యపాల్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు హేమలత, శ్రీధర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్, గణేశ్, భాష, మధుసూదన్‌చారి, రాజిరెడ్డి, దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
రామంతాపూర్ : కాలనీల అభివృద్ధే తమ ధ్యేయమని ఎమ్మెల్యే బేతిసుభాష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం రామంతాపూర్ డివిజన్లోని రాజేంద్రనగర్‌లో రూ.40 లక్షలతో సీసీ రోడ్డు, రూ.29 లక్షలతో ధోబీ ఘూట్ వద్ద స్ట్రామ్ వాటర్ పనులు, మల్లికార్జున స్వామి దేవాలయం వద్ద రూ.60 లక్షలతో సీసీ రోడ్డు పనులను స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి తో కలిసి ఆయన ప్రారంభించారు. టీఆర్ఎస్(బీఆర్ఎస్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్‌రెడ్డి, గడ్డం రవికుమార్, రవీందర్‌రెడ్డి, ముస్తాక్, గంగిడి కృష్ణారెడ్డి, తిప్పని సంపత్‌కుమార్, బోసాని పవన్‌కుమార్, సూరంశంకర్, వేముల చిన్న పాల్గొన్నారు.
రామంతాపూర్ ప్రధాన రహదారులపై కొంత మంది అవగాహన లేక ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తున్నారని దానిపై ప్రజలకు అవగాహన కల్పించి ఆటోలలో చెత్త వేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి శుక్రవారం సీపీఎం కార్యదర్శి ఎర్రం శ్రీనివాస్‌కు వినతిపత్రం సమర్పించారు. చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నాయకులు వై. వెంకేటేశ్వర్లు, కుమారస్వామి, భీష్మాచారి, నామాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఉప్పల్ : ఉప్పల్‌లో హత్యకు గురైన తండ్రి, కొడుకుల కుటుంబసభ్యులను శుక్రవారం ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి పరామర్శించారు. కుటుంభసభ్యులను ఓదార్చి, వారికి మనోధైర్యం కల్పించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, దోషులను వెంటనె అరెస్టు చేయాలని పోలీసులకు చెప్పారు. ఈ కార్యక్రమంలో జనంపల్లి వెంకటేశ్వర్‌రెడ్డి, గడ్డం రవికుమార్, కాటేపల్లి రవీందర్‌రెడ్డి, వేముల సంతోష్‌రెడ్డి, అన్య వెంకటేశ్, వేముల వెంకట్‌రెడ్డి, సత్యపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
అదేవిధంగా నాచారంలోని హెచ్ఎంటీనగర్ వెంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి హాజరై పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రామచందర్, నేతలు జనుంపల్లి వెంకటేశ్వర్‌రెడ్డి, గడ్డం రవికుమార్, కాటేపల్లి రవీందర్‌రెడ్డి, పోగుల వెంకటరమణారెడ్డి, శ్రీరామ్ సత్యనారాయణ, దేవులపల్లి యాదగిరి, సుగుణాకర్, రామచందర్, కట్ట బుచ్చన్నగౌడ్, నవీన్‌రెడ్డి, రాజేశ్, నర్సింగ్‌రావు, నేతలు, భక్తులు పాల్గొన్నారు.