హైదరాబాద్ వాతావరణ పరిస్థితులకు టెర్రస్ గార్డెనింగ్పై శిక్షణ తప్పనిసరి. లేదంటే అనుకున్న స్థాయిలో పంట దిగుబడి సాధించలేం. అయితే ఒకరిని చూసి ఒకరు టెర్రస్ గార్డెనింగ్ చేయడం కంటే ఉద్యానవన శాఖ నిచ్చే శిక్షణ తర్వాత సాగు మొదలు పెడితే ఖచ్చితమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా పంట మార్పిడి, ఎరువుల తయారీ, మట్టిలో పోషకాలు, చీడల నియంత్రణపై శాస్త్రీయ విధానంలో పెంపకందారులకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రతి బ్యాచ్లో 40-50 మధ్య ప్రతి నెల టెర్రస్ గార్డెనింగ్ తరగతులకు హాజరవుతున్నారు.
– యాదగిరి, హార్టికల్చర్ ఏడీ