శంషాబాద్ రూరల్/మణికొండ/మైలార్‌దేవ్‌పల్లి, అక్టోబర్ 6: దసరా పండుగ సందర్భంగా గురువారం శంషాబాద్ మండలంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు రాష్ట్ర మంత్రి సబితారెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్లను కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందన్భంగా వారు మాట్లాడుతూ దుర్గామాత అశ్వీస్సులతో ప్రజలంత సుఖసంతోషంగా ఉండాలని కోరా రు. మంత్రిని కలిసిన వారిలో పీఏసీఎస్ చైర్మన్ సతీష్, మండల పార్టీ ఉపాధ్యాక్షుడు హిరేకార్ శివాజీ, గణేశ్, కొమ్మ గోపాల్‌తో పాటు పలువురు నాయకులు ఉన్నారు.
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌ను కలిసిన వారిలో మున్సిపల్ చైర్పర్సన్ సుష్మరెడ్డి, వైస్ చైర్మన్ గోపాల్, ఎన్ఎంసీ చైర్మన్ వెంకటేశ్ గౌడ్, ఎంపీపీ జయమ్మశ్రీనివాస్, జడ్పీటీసీ నీరటి తన్విరాజు, మండలపార్టీ అధ్యక్షుడు కే చంద్రారెడ్డి, ఉపాధ్యాక్షుడు శ్రీకాంత్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి మోహన్‌రావు, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు దండు ఇస్తారి, సర్పంచ్‌లు రమేశ్‌యాదవ్, సతీశ్‌యాదవ్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు రమేశ్, మల్లికార్జున్, చంద్రశేఖర్, కృష్ణ, బాల్‌రాజ్ గౌడ్, సుధాకర్ గౌడ్, పాండురంగా రెడ్డి, మూలారం రాజులతో పాటు పలువురు నాయకులు ఉన్నారు.