ఉస్మానియా యూనివర్సిటీ, అక్టోబర్ 1: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పలు కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీనగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఈడీ రెండో సెమిస్టర్ రెగ్యులర్, మొదటి సెమిస్టర్ బ్యాక్లాగ్, ఇంప్రూవ్మెంట్, మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫీజును ఈనెల 14వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని చెప్పారు. రూ.200 అపరాధ రుసుముతో 17వ తేదీవరకు చెల్లించవచ్చన్నారు. మాస్టర్స్ డిగ్రీ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ (ఎండీహెచ్ఎం) నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, ఇంప్రూవ్మెంట్, మూడో సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షా ఫీజును ఈనెల 15వ తేదీలోగా, ఎంబీఏ (ఈవినింగ్) రెండు, నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్, ఇంప్రూవ్మెంట్, మొదటి, మూడో సెమిస్టర్ బ్యాక్లాగ్, ఇంప్రూవ్మెంట్ పరీక్షా ఫీజును ఈ నెల 17వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించవచ్చని పేర్కొన్నారు.
పై కోర్సుల పరీక్షలను ఈ నెలలోనే నిర్వహిస్తామని తెలిపారు. మాస్టర్ ఆఫ్ ఐప్లెడ్ మేనేజ్మెంట్ (ఎంఏఎం) (డ్యుయల్ డిగ్రీ కోర్స్ ఇన్ మేనేజ్మెంట్), ఎంబీఏ (ఐదేండ్ల్ల ఇంటిగ్రేటెడ్ కోర్స్) మొదటి, మూడు, ఐదు, ఏడు, తొమ్మిదో సెమిస్టర్ బ్యాక్లాగ్, ఇంప్రూవ్మెంట్ పరీక్షా ఫీజును ఈనెల 17వ తేదీలోగా, రూ.300 అపరాధ రుసుముతో 21వ తేదీవరకు సంబంధిత కళాశాలల్లో చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు చెప్పారు. వివరాలకు ఓయూ వెబ్సైట్ www. osmania. ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
బీఈడీ పరీక్షా ఫీజు స్వీకరణ గడువు పొడగింపు
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ పరీక్షా ఫీజు స్వీకరణ గడువును పొడగించినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీనగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఈడీ రెండు, నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్, అన్ని సెమిస్టర్ల ఇంప్రూవ్మెంట్, బ్యాక్లాగ్ పరీక్షా ఫీజును ఈ నెల 11వ తేదీ వరకు సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని చెప్పారు. రూ.200 అపరాధ రుసుముతో 14వ తేదీవరకు చెల్లించవచ్చన్నారు. వివరాలకు ఓయూ వెబ్సైట్ చూసుకోవచ్చని సూచించారు.