హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ):కేసీఆర్ మూడు అక్షరాల సక్సెస్ మంత్ర, కేసీఆర్ అంటే ఉద్యమాల ధీరుడు, అభివృద్ధి మాంత్రికుడు, సంక్షేమ ప్రదాత, ఆరోగ్య సంరక్షకుడు, ప్రతి ఇంటా పెద్ద కొడుకు, అందరి బంధువు. ఇది కేవలం మూడు అక్షరాల పేరు మాత్రమే కాదు తెలంగాణ నాలుగుకోట్ల మంది ప్రజల గుండె చప్పుడు. నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణి అన్న నినాదంతో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకువెళుతూ దేశంలోనే సుసంపన్న, ఆదర్శ వంతమైన బంగారు తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముందుకు సాగుతున్నారు. ఇక జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించేందుకు బయలుదేరి వెళ్తున్నారు. దేశ హితంకోసం అన్ని రాష్ర్టాలతో కలిసి కేంద్రంపై ఉద్యమించేందుకు సర్వ శక్తులను కూడ గడుతున్నారు. సకల జనులు సైతం సంక్షేమ సారధి దేశ రాజకీయాల్లోకి వచ్చి దేశానికే వారధిగా నిలువాలని కోరుతున్నారు.
సీఎం కేసీఆర్ ప్రజలను ఆదుకుంటున్నారు. ఒకప్పుడు గవర్నమెంట్ దవాఖాన అంటేనే భయపడాల్సి వచ్చేది. కేసీఆర్ వచ్చాక పరిస్థితులు బాగుపడ్డాయి. పైసా ఖర్చులేకుండా పేదలకు మంచి వైద్యం అందుతుంది. కేసీఆర్ కిట్ ఇస్తుండటంతో ప్రసవాలు గవర్నమెంట్ దవాఖానల్లో ఎక్కువగా జరుగుతున్నాయి. ఎంతలేదన్నా 50వేలు నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు తప్పింది. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే ఇలాంటి పథకాలతో ప్రజలకు మేలు చేస్తాడు.
కేసీఆర్ వస్తేనే మరింత మార్పు
మహిళా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్య, ఉపాధి కల్పన, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్, దళిత బంధు, రైతు బంధు, ఉచిత కరెంటు ఇలా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అన్ని వర్గాలకు ఆదుకుంటున్నారు. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే ఇక్కడి పథకాలు దేశ మంతా అమలవుతాయి. అప్పుడే దేశంలో మంచి మార్పు వస్తుంది.
– నవనీత, మియాపూర్.
ఇక్కడి పథకాలు దేశవ్యాప్తం కావాలి
తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ఉద్యమ నాయకుడు సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావడం శుభ పరిణామం. రాష్ట్రం ఏర్పడిన అనంతరం మహిళలకు, గర్భిణుల కోసం చేపట్టిన సంక్షేమ పథకాలు చరిత్రలో నిలిచిపోయి. అటువంటి గొప్ప పథకాలు దేశవ్యాప్తం కావాలంటే సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలి.
–వి జ్యోతి,అచ్చంపేట, కోఠి ప్రసూతి దవాఖాన
కేసీఆర్ కిట్ దేశవ్యాప్తం చేయాలి..!
దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. పేద ప్రజలు ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవించిన వారికి కేసీఆర్ కిట్ పథకం చాలా బాగుంది. ఆడబిడ్డ పుడితే రూ.13వేలు, మగబిడ్డ అయితే రూ.12వేలు ఇవ్వడం పేదవారికి ఎంతో మేలు జరుగుతుంది. దవాఖాన నుంచి డిశ్చార్జ్ అనంతరం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అమ్మ ఒడి వాహనంలో ఇంటికి తీసుకెళ్లడం గొప్పవిషయం. ఇలాంటి సీఎం దేశ రాజకీయాల్లోకి వస్తే ప్రభుత్వ దవాఖానలపై ప్రజలకు నమ్మకం కలుగుతుంది.
–టి.జ్యోతి, బొల్లారం.