ఉప్పల్ జోన్ బృందం, సెప్టెంబర్ 21: బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అందజేసిన బతుకమ్మ చీరలను బుధవారం ఉప్పల్ నియోజకవర్గంలో పలు డివిజన్లలో లబ్ధిదారులకు అందజేశారు. నియోజకర్గంలోని నాచారం, చర్లపల్లి, కాప్రా, రామంతాపూర్, హబ్సిగూడ డివిజన్లలో బతుకమ్మ చీరలను అధికారులతో కలిసి స్థానిక కార్పొరేటర్లు మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు కార్పొరేటర్లు మాట్లాడుతూ.. తెలంగాణలో గొప్పగా జరుపుకునే పండు గ బతుకమ్మ అని, పేద, మధ్యతరగతి అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ప్రతి ఆడపడుచుకు బతుకమ్మ సారెలను పంపిణీ చేయడం హర్షణీయమన్నారు. పండుగకు కొత్త చీరలు అందడంతో మహిళలు మురిసిపోతున్నారని అన్నారు.
డివిజన్ పరిధిలోని బంజారాకాలనీ, వలువర్నగర్ కాలనీలో కార్పొరేటర్ స్వర్ణరాజు లబ్ధిదారులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉప్పల్ టీఆర్ఎస్ మైనారిటీ అధ్యక్షుడు ఎంకే బద్రుద్దీన్, మహేశ్, పవన్, కొప్పులకుమార్, రేగళ్ల సతీశ్‌రెడ్డి, మచ్చపాండు గౌడ్, భానుమతి, అరవింద్, మోహన్, గౌస్, తదితరులు పాల్గొన్నారు.
డివిజన్లోని ఎర్రకుంట ఎల్బీఎస్ కమ్యూనిటీహాల్లో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ శాంతిసాయిజెన్ శేఖర్, టీఆర్ఎస్ నాయకులు శ్రీరామ్ సత్యనారాయణ, కర్ణ, మంగోల్ శివ, అంజి, శివ, రవి, ప్రీతిరెడ్డి, రాజు, వాణి పాల్గొన్నారు.
డివిజన్లోని చక్రీపురం, ఆఫీసర్స్ కాలనీ, పుక్కట్‌నగర్ తదితర ప్రాం తాల్లో ప్రభుత్వం అందజేసే బతుకమ్మ చీరలను సర్కిల్ ప్రాజెక్ట్ అధికారిణి రమాదేవితో కలిసి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి మహిళలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్కిల్ కమ్యూనిటీ ఆర్గనైజర్ గోపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు నాగిళ్ల బాల్‌రెడ్డి, బాబు గంగపుత్ర, బొడిగె ప్రభుగౌడ్, రాజేశ్వర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, మొగిలి రాఘవరెడ్డి, వెంకట్‌రెడ్డి, అశోక్, హరినాథ్, సోమయ్య, తదితరులు పాల్గొన్నారు.
డివిజన్ రాంరెడ్డినగర్, రామంతాపూర్ డివిజన్లలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉప్పల్ డీసీ అరుణకుమారి, కార్పొరేటర్లు కక్కిరేణి చేతన, బండారు శ్రీవాణి వెంకట్రావు , మున్సిపల్ సిబ్బంది, సంజయ్ పటేల్, తదితరులు పాల్గొన్నారు. హెచ్‌బీకాలనీ డివిజన్లో బతుకమ్మ చీరలను కార్పొరేటర్ ప్రభుదా స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, కాప్రా సర్కిల్ ఇన్చార్జి ప్రాజెక్టు అధికారిణి రమాదేవి, టీఆర్ఎస్ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.