మాదాపూర్, సెప్టెంబర్ 9: కొండాపూర్ కేఎల్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీలో వారం రోజులపాటు నిర్వహించనున్న యానిమేషన్, గేమింగ్ వర్క్‌షాప్‌ను శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, గ్రీన్ గోల్డ్ యానిమేషన్స్ వ్యవస్థాపకులు, సీఈవో రాజీవ్ చిలక, డిస్ట్రీట్ ఆర్ట్ వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీకాంత్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ..
గ్లోబల్ బిజినెస్ స్కూల్‌గా ఖ్యాతి గడించిన కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ నూతన ప్రతిభావంతులను తీర్చిదిద్దడంతో పాటు వారి కళల సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుచుకునేందుకు ఇటువంటి వర్క్‌షాప్‌లు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. గేమింగ్ పరిశ్రమ సానుకూల వృద్ధి సాధిస్తుండటంతో పాటు 2025 నాటికి 182 బిలియన్ డాలర్ల మార్కును అధిగమించనున్నట్లు కేఎల్ డాక్టర్ రామకృష్ణ అంచనా వేశారు. విజువల్ సాంకేతిక ఆధారంగా యానిమేషన్, వీఎఫ్ఎక్స్, గేమ్స్ అత్యంత వృద్ధి చెందుతున్నట్లు తెలిపారు. భవిష్యత్‌లో వీటికి మంచి డిమాండ్ ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.