గోల్నాక, సెప్టెంబర్ 9: మద్యం మత్తులో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఒకరి హత్యకు దారితీసింది. అంబర్పేట ఇన్స్పెక్టర్ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. గోల్నాక చేపల మార్కెట్లో నివాసముండే తాండ్ర గణేశ్(22), శాంతినగర్లో ఉంటున్న లక్ష్మణ్ స్నేహితులు. శుక్రవారం తెల్లవారుజామున మద్యం మత్తులో ఉన్న వీరు.. డబ్బుల విషయంలో గొడవపడ్డారు. ఈ క్రమంలో లక్ష్మణ్ కత్తితో పొడవడంతో గణేశ్ అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.