మేడ్చల్ రూరల్, సెప్టెంబర్ 8 : పచ్చదనం, పారిశుధ్యంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్ అధికారులకు సూచించారు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని కిష్టాపూర్‌లో ఉన్న సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలను గురువారం సందర్శించారు. స్వచ్ఛ గురుకుల డ్రైవ్‌లో భాగంగా పాఠశాలను సందర్శించి, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు.
స్వతంత్ర వజ్రోత్సవంలో భాగంగా టీఎస్‌డబ్ల్యూఆర్ ఆకారంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పచ్చదనం, పారిశుధ్యంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. నాటిన ప్రతి మొక్క బతికేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్వచ్ఛ డ్రైవ్‌లో భాగంగా కిచెన్, డైనింగ్, పరిసరాలను విద్యార్థులు, టీచర్లు శుభ్రం చేశారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్పర్సన్ దీపికానర్సింహా రెడ్డి, కమిషనర్ షఫీ అహ్మద్ఉల్లాహ్, టౌన్‌ప్లానింగ్ అధికారి రాజీవ్, పౌరసంబంధాల అధికారి రాజీవ్, ప్రిన్సిపాల్ శైలజ, వైస్ ప్రిన్సిపాల్ దుర్గాసత్యవతి, శ్రీధర్ గౌడ్ పాల్గొన్నారు.
ఘట్కేసర్ రూరల్, సెప్టెంబర్ 8 : పరిశుభ్రత, పర్యావరణం, పచ్చదనం పట్ల విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మేడ్చల్ జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి సూచించారు. అంకుషాపూర్‌లోని గురుకుల డిగ్రీ కళాశాలను స్వచ్ఛ గురుకుల్ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా యాదాద్రి జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డితో కలిసి గురువారం పరిశీలించారు.
విద్యార్థుల ఆరోగ్యం పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గురుకులంలో అందిస్తున్న ఆహారం, తాగునీటి సరఫరా, ఇతర మౌలిక సదుపాయాల వివరాలను విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు కుమార్, పంచాయతీ సభ్యుడు బాలరాజు, గురుకుల కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.