కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 8 : ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా వైద్యశాఖాధికారులు తగు చర్యలు తీసుకోవాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సూచించారు. గురువారం కొంపల్లి మున్సిపాలిటీ పరిధి, 13వ వార్డు ఉమామహేశ్వరకాలనీలో నూతనంగా ఏర్పా టు చేసిన బస్తీ దవాఖానను జిల్లా అదనపు వైద్యాధికారి ఆనందం, మండల వైద్యాధికారిణి నిర్మల, చైర్మన్ సన్న శ్రీశైలంయాదవ్తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు సమీప ప్రాంతంలోనే అందాలనే లక్ష్యంతో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశామని అన్నారు.
జీడిమెట్ల డివిజన్ పరిధిలో సాగుతున్న కోల్కాల్వ నిర్మాణ పనులపై ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. వర్షాలు పడి స్థానిక ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, దీని ప్రారంభంలోనే అనుకున్న లక్ష్యసాధన దిశగా పూర్తి చేసేలా సంబంధిత ప్రాజెక్టు అధి కారులు చర్యలు తీసుకోవాలన్నారు. సకాలంలో పనులు పూర్తి చేయకపోతే మరో సంస్థకు పనులు అప్పగించాల్సి వస్తుందని అన్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల స్థానిక కాలనీలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్ మమతతోపాటు డీసీ మంగతాయారుకు సూచించారు.
కుత్బుల్లాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ లింగంగౌడ్ వర్ధంతి సందర్భంగా కుత్బుల్లాపూర్ చౌరస్తాలో ఉన్న ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పూలదండలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు.