పీర్జాదిగూడ, సెస్టెంబర్ 7: పేదలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మొదటి డివిజన్ భగత్‌సింగ్ కాలనీ, 4వ డివిజన్ లక్ష్మీనగర్ కాలనీలో బుధవారం బస్తీ దవాఖాలను మంత్రి ప్రారంభించారు. ఈ దవాఖానల్లో ఔట్ పేషంట్ సేవలతో పాటు 57 రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ దవాఖాన సేవలను సద్వినియోగం చేసుకోవాలాన్నారు. అనంతరం రామచందర్‌సింగ్ కాలనీలోని గురుకుల బాలికల జూనియర్ కళాశాలను మంత్రి సందర్శించి, మొక్కలు నాటారు. కార్యక్రమంలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్, కార్పొరేటర్లు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.