బంజారాహిల్స్, సెప్టెంబర్ 5: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి చెందిన ఎడ్యుకేషన్ విభాగం ఆధ్వర్యంలో సోమవారం ‘నూతన విద్యావిధానం-2020లో గాంధీజీ భావన’ అనే అంశంపై జాతీయ సింపోజియం నిర్వహించారు. మహాత్మాగాంధీ నేషనల్ కౌన్సిల్ ఫర్ రూరల్ ఎడ్యుకేషన్ చైర్మన్ డాక్టర్ డబ్ల్యూజీ ప్రసన్న కుమార్ ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం, ఉత్తమ అధ్యాపకుడిగా ఎంపికైన కామర్స్ విభాగం డీన్ ప్రొఫెసర్ ఐ.ఆనంద్ పవార్‌ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా రేడియో మాజీ డైరెక్టర్ డా.నాగసూరి వేణుగోపాల్, యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొ.కే.సీతా రామారావు, అకడమిక్ డైరెక్టర్ ప్రొ.సుధారాణి, రిజిస్ట్రార్ డా. ఏవీఎన్ రెడ్డి, డా.చంద్రకళ, డా.మేరీ సునంద పాల్గొన్నారు.