ముషీరాబాద్/కవాడిగూడ/చిక్కడపల్లి, సెస్టెంబర్ 4: వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన మండపాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని ఎమ్మె ల్యే ముఠా గోపాల్ సూచించారు. ఈ మేరకు ఆదివారం కవాడిగూడ డివిజన్లోని మారుతీనగర్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్. రాజేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చే సిన వినాయక విగ్రహం వద్ద ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరై గణనాథుడికి పూజలు చేశారు. అనంతరం ప్రేం రాజ్ సహకారంతో టీఆర్ఎస్ నగర యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ భక్తులకు అన్నదానం చేశారు. మారుతీనగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులు సాయి శంకర్, యాదగిరి, సాయికుమార్, ప్రేంకుమార్, కిరణ్, శ్రీనివాస్, వాసు, పూర్ణచందర్, నరేందర్ పాల్గొన్నారు.
అదే విధంగా దోమలగూడలోని పూల్‌బాగ్‌లో సందీప్, భోలక్‌పూర్‌లోని శేఖర్‌రెడ్డి దవాఖాన వద్ద మహేశ్‌కుమార్‌ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహాల వద్ద ఎమ్మెల్యే ముఠా గోపాల్ గణనాథుడికి పూజలు చేశారు. బాగ్‌లింగంపల్లి అచ్చయ్యనగర్‌లోని శ్రీ వైష్ణవి అపార్ట్మెంట్ వాసులు ఏర్పాటు చేసిన గణేశుని మం డపం వద్ద ఎమ్మెల్యే పూజలు చేశారు. శ్రీ వైష్ణవి అపార్ట్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, కార్యదర్శి పి.వెంకటేశ్వర్లు, కోశాధికారి బాలకృష్ణ య్య, బి. వెంకట్ స్వామిగౌడ్ పాల్గొన్నారు.
ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని శ్రీలక్ష్మీ గణపతి దేవాలయంలో స్వామి వారి నవరాత్రి మహోత్సవాలు ఘనం గా కొనసాగుతున్నాయి. ఆదివారం స్వామి వారికి వివి ధ ఫల రసాలతో అభిషేకం, దూర్వార్చన తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయం చైర్మన్ ముచ్చకుర్తి ప్రభాకర్, ఈఓ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గాంధీనగర్‌లోని మహాత్మా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక పడపంలో స్వామి వారిని ఆదివారం గ్రేటర్ నాయకులు ఎంఎన్ శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో డి. చంద్రశేఖర్, దీపక్, బాబురావు, నరసింహారావు, పరకాల రజనీకాంత్ గౌడ్, చిన్న తదితరులు పాల్గొన్నారు.
జీహెచ్ఎంసీ స్టాడింగ్ కమిటీ మాజీ సభ్యుడు వి.శ్రీనివాస్‌రెడ్డి బాగ్‌లింగంపల్లిలో ఏర్పాటుచేసి గణేశుడిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కల్వ గోపి, సిరిగిరి కిరణ్, కార్తిక్ యాదవ్, మధు, శివ, రంజీత్, అమిత్, అజ్జూ తదితరులు పాల్గొన్నారు.