మేడ్చల్ కలెక్టరేట్, సెప్టెంబర్ 4 : తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఆదివారం దమ్మాయిగూడ మున్సిపాలిటీలో నూతన ఆసరా పింఛన్ కార్డులను అందజేశారు. అంతకు ముందు మున్సిపల్ పరిధిలోని అహ్మద్‌గూడ రాజీవ్‌గృహకల్ప కాలనీలో నిర్మించిన బస్తీ దవాఖానను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం వారికి అందుబాటులో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసి మెరుగైన వైద్య సేవలందిస్తున్నారని చెప్పారు 57 ఏండ్లు నిండిన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెద్ద కొడుకులాగా నెల నెలా పింఛన్లు అందజేసి ఆదుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి శ్రీనివాస్, మండల వైద్యాధికారి సరిత, వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి హరిగౌడ్, నాయకులు యాదగిరి గౌడ్, రమేశ్ గౌడ్, రాజు ముదిరాజ్, భాస్కర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, కార్తిక్ గౌడ్, శ్రీనివాస్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, అధికారులు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.