మణికొండ, సెప్టెంబర్ 4 : తెలంగాణ రాష్ట్రం సాధించకున్న తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమైందని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ అన్నారు. నార్సింగి మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ విస్త్రృత స్థాయి కార్యకర్తల సమావేశాన్ని ఆదివారం నార్సింగి రాయల్ ఫంక్షన్హాల్లో నిర్వహించారు. ర్యాలీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలతో పార్టీ అధ్యక్షుడు నర్సింహ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు.
అభివృద్ధి విషయంలో రాజీపడకుండా రాజకీయాలకతీతంగా పనిచేస్తున్నామన్నారు.అభివృద్ధిని చూసి వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపించాలని సూచించారు. ఇటీవలే డిగ్రీ కళాశాలను మంజూరు చేయించామని, త్వరలోనే నార్సింగి మున్సిపాలిటీలో మంచి క్రీడాప్రాంగణం, అధునాతన మార్కెట్ యార్డు, జూనియర్ కళాశాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. అభివృద్ధిని చూసే ప్రజలు ఓట్లు వేయాలని కోరారు. అల్లర్లు సృష్టించేందుకు కుట్రలు చేస్తున్న బీజేపీని నమ్మొద్దన్నారు.
బండి సంజయ్ మాయ మాటలు చెప్పి పాదయాత్రలు చేయడం కాదు…రాష్ర్టానికి నీవు ఏం చేస్తావో స్పష్టంగా చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత కాలం మతకల్లోలాలు సృష్టిస్తే జైలుకు పంపడం ఖాయమని హెచ్చరించారు. ఇటీవల ఎమ్మెల్యేలతో సమావేశమైన సమయంలో సీఎం కేసీఆర్ ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకోండి అని చెప్పారు.
వారితో కలిసి నెలకోసారి వనభోజనాలు చేయాలని సూచించారని గుర్తుచేశారు. మోదీకి మత పిచ్చిపట్టిందని ఇలాంటి వారు సమాజానికి ప్రమాదమని ఇలాంటి మతతత్వ పార్టీలను బొందపెట్టండని ప్రజలకు సూచించారు. నార్సింగి మున్సిపల్ చైర్పర్సన్ దారుగుపల్లి రేఖయాదగిరి, వైస్ చైర్మన్ వెంకటేశ్‌యాదవ్,మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్‌గౌడ్,వైస్ చైర్మన్ ప్రవీణ్‌యాదవ్,మాజీ ఎంపీపీ మల్లేశ్, పార్టీ అధ్యక్షుడు నర్సింహ, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.