మన్సూరాబాద్, సెప్టెంబర్ 4: తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నాగోల్, జైపురికాలనీలోని కమ్యూనిటీ హాల్లో విముక్త జాతుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సామాజిక కార్యకర్త కటకం నర్సింహారావు మాట్లాడుతూ.. సంచార జాతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. సమాజంలో సంచార జాతుల పట్ల గౌరవం పెంపొందేలా చర్యలు చేపట్టాలని కోరారు.
సంచార జాతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నరేందర్ మాట్లాడుతూ.. సంచార జాతుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రెండు సార్లు జాతీయ కమిషన్లు వేసి నివేదిక ఇచ్చినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోయిందని అన్నారు. ఐక్యంగా పోరాడితేనే సంచార జాతుల కులాల సమస్యలు పరిష్కరించ బడుతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ తిపిరిశెట్టి, అధికార ప్రతినిధి వెన్నెల నాగరాజు, కోఆర్డినేటర్ పల్లపు సమ్మయ్య, వంశీరాజ్ కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్యామల యాదగిరి, వడ్డెర కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్, వివిధ సంఘాల ప్రతినిధులు కోట రాములు, లక్ష్మణ్‌రావు, బండారి యువరాజు, పన్నీరు నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.