గౌతంనగర్, సెప్టెంబర్ 3: పారిశ్రామిక కార్మికుల పిల్లల కోసం మౌలాలి పారిశ్రామిక ఇండస్ట్రియల్ ఎస్టేట్లో టీఎస్ఐఐసీ సీఈవో మధుసూదన్, ఎస్ఐడీబీఐ డీజీఎం విద్యాసాగర్లు శుక్రవారం అవేక్షా డే కేర్ ఉచిత సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఈవో మధుసూదన్ మాట్లాడుతూ పారిశ్రామిక ఏరియాలో పనిచేసే కార్మికులకు చెందిన పిల్లలను ఉచితంగా డేకేర్ సెంటర్ తీసుకుంటామని తెలిపారు.
తల్లిదండ్రులు కంపెనీలో పనిచేసే ముందు డేకేర్ సెంటర్కు తీసుకవచ్చి వదిలేయాలని, తిరిగి కంపెనీలో విధులు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లే ముందు వారి పిల్లలను తీసుకపోవాలని తెలిపారు. ఎలాంటి ఫీజులు తీసుకోరని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మలాలి పారిశ్రామిక వాడలో ఏర్పాటు చేసి సెంటర్ ఆరవదని త్వరలోనే 14 డే కేర్ సెంటర్లను ప్రారంభిస్తామని తెలిపారు. పారిశ్రామిక కార్మికుల సమగ్ర సంక్షేమం చాలా ముఖ్యమని అన్నారు.
ఒక్కొక్క కేంద్రం ఏర్పాటుకు రెండు లక్షల రూపాయలు వెచ్చిస్తున్నామని అన్నారు. తెలంగాణలో 20 కేంద్రాలను ఏర్పాటు చేసిన తరువాత భారత దేశం అంతటా డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఓడబ్ల్యూఈ సభ్యులు ఉమా గుర్జా, మౌలాలి టీఎస్ఐఐసీ జేడ్ఎం మాధవి, ఆర్.భవాని, ఇండస్ట్రియల్ ఏరియా చైర్మన్ ఏ.ఉత్తంరెడ్డి, కార్యదర్శి కేవీ చంద్రశేఖర్ రావు, కోశాధికారి సీవీబీ కృష్ణ పాల్గొన్నారు.