ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వివిధ రాష్ర్టాల ప్రజలంతా దేశ్‌కీ నేతగా చూడాలని కోరుకుంటున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిదేండ్లుగా అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన విధానాలను చూసి దేశంలోని ప్రజలంతా ఇలాంటి ముఖ్యమంత్రి ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఏ రాష్ర్టానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లిన వివిధ రాష్ర్టాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు.