మేడ్చల్ కలెక్టరేట్, ఆగస్టు 29 : నాగారం మున్సిపాలిటీని ఆదర్శంగా అభివృద్ధి చేస్తామని చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో సోమవారం కౌన్సిల్ సాధారణ సమావేశాన్ని చైర్మన్ అధ్యక్షతన నిర్వహించారు. మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి పనులకు రూ.40 లక్షలు కేటాయిస్తూ తీర్మానం చేశారు. వెంకటాద్రి నగర్ పార్కు అభివృద్ధికి రూ. 5లక్షలు, వివిధ వార్డుల్లో సీసీరోడ్డు నిర్మాణాలకు రూ.13 లక్షలు, గణేశ్ నిమజ్జనం ఏర్పాట్లకు రూ.3 లక్షలు, పారిశుధ్య సిబ్బందికి పలు వస్తువుల కొనుగోలుకు రూ.18 లక్షలు కేటాయిస్తూ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా చంద్రారెడ్డి మాట్లాడుతూ అన్ని వార్డులకు త్వరలోనే బడ్జెట్ ప్రకారం నిధులు కేటాయిస్తామని తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ మల్లేశ్ యాదవ్, మేనేజర్ చంద్రశేఖర్, డీఈ రఘు, టీపీవో కరుణాకర్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
లబ్ధిదారుడికి సీఎంఆర్ఎఫ్ చెక్కు..
నాగారం మున్సిపాలిటీకి చెందిన భిక్షపతి వైద్య సహాయ నిమిత్తం సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకోగా రూ.60 వేల చెక్కు మంజూరైంది. ఈ చెక్కును చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి లబ్ధిదారుడికి సోమవారం అందజేశారు. టీఆర్ఎస్ యూత్ నాయకులు రాహుల్ రెడ్డి, యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ వామన్ రావు, శ్రీహరి, రవి లింగం పాల్గొన్నారు.
18వ వార్డులో సీసీ రోడ్డు పనులు..
మున్సిపల్ పరిధిలోని 18వ వార్డులో రూ.8 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను సోమవారం మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి ప్రారంభించారు. కౌన్సిలర్లు హరిబాబు, శ్రీనివాస్ గౌడ్, నాయకులు , కాలనీ వాసులు పాల్గొన్నారు.