మన్సూరాబాద్/వనస్థలిపురం, ఆగస్టు 29: అభివృద్ధి పనులను వేగవంతం చేసి ఎల్బీనగర్ నియోజకవర్గం రూపురేఖలు మారుస్తామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. నాగోల్ డివిజన్ పరిధి ఆదర్శనగర్, శ్రీనివాసకాలనీ, శివపురికాలనీ, సౌత్ఎండ్ పార్కు కాలనీ, విశాలాంధ్ర కాలనీల్లో రూ.90లక్షలతో నూతనంగా ఏర్పాటు చేయనున్న సీసీ రోడ్డు పనులకు సోమవారం స్థానిక కార్పొరేటర్ చింతల అరుణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాలాంధ్రకాలనీలో ఉన్న ఇరవై రెండు గుంటాల ఖాళీ స్థలంలో త్వరలో పార్కును ఏర్పాటు చేసి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామని తెలిపారు. ఆటోనగర్ డంపింగ్ యార్డులో రాత్రి సమయాల్లో కొందరు గుట్టు చప్పుడు కాకుండా వివిధ ప్రాంతాల నుంచి ట్యాంకర్ల ద్వారా తీసుకొచ్చి రసాయన వ్యర్థాలను పారబోస్తున్నట్లు సమాచారం ఉందని తెలిపారు. సదరు ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఇప్పటికే ఏర్పాటు చేశామని వాటి ద్వారా వ్యర్థ రసాయనాలను డంప్ చేస్తున్న వ్యక్తులను గుర్తిస్తామని.. దీని వెనుకు ఎంతటి వారు ఉన్నా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
ఫతుల్లాగూడలో సుమారు రూ.21కోట్లతో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ల కోసం ఆరు ఎకరాల స్థలంలో నిర్మించిన మహాప్రస్థానం పనులు పూర్తయ్యాయని.. త్వరలో ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభింపజేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు తూర్పాటి చిరంజీవి, నాయకులు అనంతుల రాజిరెడ్డి, చింతల సురేందర్‌యాదవ్, చెరుకు ప్రశాంత్‌గౌడ్, తూర్పాటి కృష్ణ, సుర్వి రాజుగౌడ్, సతీశ్‌యాదవ్, జక్కిడి రఘువీర్‌రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి, తూర్పాటి సతీశ్, ఆదర్శనగర్కాలనీ అధ్యక్షుడు రాజగోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సద్గురు రెడ్డి, శ్రీనివాసకాలనీ ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి, సామ కృష్ణారెడ్డి, వెంకటరావు, కృష్ణమూర్తి, జయకుమార్, సౌత్ఎండ్ పార్కు కాలనీ అధ్యక్షుడు రమేశ్, ప్రధాన కార్యదర్శి పీటీ రెడ్డి, ఉపాధ్యక్షుడు రవికుమార్, విశాలాంధ్ర కాలనీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ రెడ్డి, వెంకటేశ్వర రావు, రాజు, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు సన్మానం
ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డికి డాక్టరేట్ వచ్చిన సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు కంచర్ల శివారెడ్డి, డేరంగుల కృష్ణ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కాంపు ఆఫీస్‌కు వెళ్లిన నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సుజాత, సీనియర్ నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, జంగారెడ్డి, అనిత్, కిట్టు యాదవ్, గోపి మధు, సురేశ్, విష్ణుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
.. అలాగే మన్సూరాబాద్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు జక్కిడి మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కర్మన్‌ఘాట్ ఆంజనేయ స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, నాయకులు కొసనం వెంకట్‌రెడ్డి, పోచబోయిన గణేశ్‌యాదవ్, సిద్దగోని జగదీశ్‌గౌడ్, రాకేశ్‌రెడ్డి, ఏర్పుల యాదయ్య తదితరులు పాల్గొన్నారు.