చిక్కడపల్లి,ఆగస్టు28: ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీకర హాస్పిటల్‌ను హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ,రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హోం మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు.ముషీరాబాద్,అంబర్పేట్ ఎమ్మెల్యేలు ముఠాగోపాల్,కాలేరు వెంకటేశ్ పలు విభాగాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీకర హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ అఖిల్ దాడి మాట్లాడుతూ కార్పొరేట్ వైద్య సేవలను సామాన్య ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పావని, టీఆర్ఎస్ గ్రేటర్ నాయకుడు ఎం.ఎన్ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రమూర్తి,టీఆర్ఎస్ నాయకులు జయసింహ, పద్మ, డాక్టర్ రమా సరస్వతి, వైస్ ప్రెసిడెంట్ నిఖిల, ఆర్థోపెడిక్ సర్జన్స్, వైద్య బృందం పాల్గొన్నారు.