సికింద్రాబాద్, ఆగస్టు 28: అర్హులందరికీ ఆసరా పింఛన్లు అందించేందుకు వీలుగా ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. ఈ మేరకు ఆదివారం సీతాఫల్మండి డివిజన్ పరిధిలోని లబ్ధ్దిదారుల ఇంండ్ల వద్దకెళ్లి నేరుగా డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ సీఎం సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్) చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సికింద్రాబాద్ పరిధిలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఏకకాలంలో చేపడుతున్నామని తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి, సహాయానికి తమ క్యాంపు కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సామల హేమ, టీఆర్ఎస్ నాయకుడు రామేశ్వర్గౌడ్, పార్టీ నాయకులు,అధికారులు పాల్గొన్నారు.
శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకం
పోలీస్ సిబ్బంది అంకిత భావంతో తమ విధులను నిర్వర్తిస్తున్న కారణంగానే సమాజంలో శాంతి భద్రతలు విరజిల్లుతున్నాయని డిప్యూటీ స్పీకర్ అన్నారు. 1995 బ్యాచ్ సిబ్బంది ఆధ్వర్యంలో సీతాఫల్మండిలోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో జరిగిన సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మారావు గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1995 బ్యాచ్ సిబ్బంది రాష్ట్ర పోలీస్ శాఖలో నిర్వహిస్తున్న సేవలు ప్రసంసనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ అదనపు ఎస్పీ కే.నరసింహ, పోలీస్ అధికారులు విక్టర్, ప్రతినిధులు మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు.