జూబ్లీహిల్స్, ఆగస్టు 27: బీజేపి పాలకులు పేదల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని, పేదలు వాడే ప్ర తి వస్తువులపై జీఎస్టీ రూపేణ పన్నులు వేసి పేదవాన్ని మరింత కుంగదీస్తున్నారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మండిపడ్డా రు. గత 75 ఏండ్లుగా ఎన్నడూ లేని విధంగా మన దేశం లో మనం వాడుకునే వస్తువులపై పన్నులు కట్టాల్సిన దుస్థితి నెలకొన్నదని ఎద్దేవా చేశారు. సుసంపన్నంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్‌పరం చే స్తూ దేశాన్ని భ్రష్టుపట్టించడమే కాక బడా బాబుల కొ మ్ము కాస్తూ రూ.10లక్షల కోట్లు రుణ మాఫీ, ఆయా కార్పొరేటర్ సంస్థలకు రూ.5 లక్షల కోట్లు ట్యాక్స్ మాఫీ చేసిన బీజేపీ ప్రభుత్వం పేదవాడు వాడే ప్రతి వస్తువుపై జీఎస్టీ విధించడం సిగ్గుచేటని విమర్శించారు.
శనివారం యూసుఫ్‌గూడ హరిజన బస్తీకి చెందిన పల్లె నాగరాజు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన 300 మంది మి త్ర బృందానికి కుండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. యూసుఫ్‌గూడ కూడలిలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మల్టీ నేషనల్ కంపెనీలకు ఇన్ని లక్షల కోట్లు మాఫీ చేయగలుగుతున్న కేంద్ర ప్రభుత్వం పేదవాడు వాడే ఉప్పు, పప్పు, పాలు, కూరగాయలతో పాటు చివరికి శవాలపై కూడా పన్నులు విధిస్తుండటం చరిత్రలో అత్యంత దుర్దినాలుగా మిగిలిపోతాయని పేర్కొన్నారు. బీజేపీ పాలకులు పేదలపై వేసిన పన్నుల భారాన్ని ఉపసంహరించకపోతే పేదల చేతిలో ఆ పార్టీకి సంహారం తప్పదని హెచ్చరించారు.
చెప్పులు మోసే బండి సంజయ్.. ఏం ఉద్ధరించావని పాదయాత్రలు చేస్తున్నావో చెప్పాలన్నారు. బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయ న్నారు. పేదల అభ్యున్నతికి పాటుపడుతున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సంతో ష్, ఖైసర్ జహాన్, కళ్యాణి, గీతా గౌడ్, చిన్న యాదవ్, శ్రీను, నాగరాజు, నవీన్, స్రవంతి, అరుణ, లక్ష్మి, మా ధవి, రేణుక, సీహెచ్ సాయిలక్ష్మి పాల్గొన్నారు.