ఉప్పల్, ఆగస్టు 27 : పర్యావరణహితం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. హబ్సిగూడలోని ఎమ్మెల్యే నివాసంలోని కార్యాలయంలో టీఆర్ఎస్ నేత గుడి మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎకో ఫ్రెండ్లి సీడ్ గణేశ్ ప్లాంటే ఏ విగ్నేశా కిట్లను శనివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులనే ప్రతిష్ఠించి.. పూజించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ, పర్యావరణానికి హాని కలిగించే విగ్రహాలు ఏర్పాటు చేయకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రభుదాస్, నిర్వాహకులు ప్రేమ్ సతీ శ్, కూన అఖిల్, సురేంద్ర, నేతలు గరిక సుధాకర్, వేముల సంతోశ్‌రెడ్డి, కాసం మహిపాల్‌రెడ్డి, మేకల ము త్యంరెడ్డి, ఎండీ ముస్తాక్, తదితరులు పాల్గొన్నారు.
నాచారంలో మట్టి వినాయకుల పంపిణీ..
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టిగణపతినే పూజించాలని నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతిసాయిజెన్ శేఖర్ అన్నారు. నాచారం డివిజన్లోని హెచ్ఎంటీనగర్లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వి నాయకులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సాయిజెన్ శేఖర్, డివిజన్ అధ్యక్షుడు మేకల ముత్యంరెడ్డి, చంద్రశేఖర్, కట్ట బుచ్చన్న, రామకృష్ణ, రెబల్ రాజు, తిరుపతి, దాసరి కర్ణ, వాసు, తిరుమ ల్, జయరాజ్, జవాన్ కృష్ణ, ఎస్ఎఫ్ఏ యాకస్వామి, శ్యామల పాల్గొన్నారు.