హిమాయత్‌నగర్, ఆగస్టు 23: కేం ద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కా ర్ పాలనను అంతం చేసేందుకు బలమై న పోరాటాలు కొనసాగించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. సీపీఐ హైదరాబాద్ జిల్లా 23వ మహాసభల సందర్భంగా మంగళవారం హిమాయత్నగ ర్ నుంచి రాంకోఠి వరకు వందలాది మంది సీపీఐ శ్రేణులు ఎర్ర జెండాలు పట్టుకుని పాటలు పాడుతూ, నృత్యాలు చేసుకుంటూ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం షాలిమార్ ఫంక్షన్ హాల్లో జరిగిన బహిరంగ సభలో సీపీఐ జాతీ య కార్యవర్గ సభ్యుడు సయ్యద్ అజీజ్ పాషా, రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఏఐటీయూసీ రా ష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్, సీపీఐ నగర కార్యదర్శి ఈ.టీ.నరసింహతో కలిసి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న తిరోగమన విధానాల వల్ల దేశ ప్రాథమిక నిర్మాణాన్ని దెబ్బ తీస్తున్నదని, మతోన్మాదం, అవినీతి, అక్రమాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని విమర్శించా రు. బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం కేసులో జీవిత ఖైదు పడిన 11 మంది దోషులను గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం విడుదల చేయడం సిగ్గు చేట ని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఛాయాదేవి, నర్సింహ, కె. యాదగిరి, ఆర్.శంకర్ నాయక్, ఎన్.శ్రీ కాంత్, బి.స్టాలిన్, జె.శ్రీనివాస్, పి.నరసింహారెడ్డి, జి.చంద్రమోహన్ గౌడ్, సలీంఖాన్, పి.నరసింహా, లక్ష్మీనారాయణ, రాజ్ కుమార్, మల్లేశ్, నళిని, కుమార్, సక్రిబాయి, అమీనా, నరేష్, హరికృష్ణ, ఓమర్‌ఖాన్ పాల్గొన్నారు.