ఉప్పల్, ఆగస్టు 21 : దళిత బంధు పథకం.. దళితుల అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తుందని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. చిలుకానగర్ డివిజన్, ఆదర్శనగర్‌లో మొగిలిపాక రామచంద్రంకు దళితబంధు ద్వా రా మంజూరైన సిద్ధివినాయక టెంట్హౌజ్ను ఆదివా రం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన దళితబంధు ఎంతోమందికి జీవనోపాధిని కల్పిస్తుందన్నారు. సమాజంలో గౌరవంగా బతికేవిధంగా వ్యాపార, జీవనోపాధిని కల్పించడం హర్షణీయమన్నారు. దళితులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. దళిత కుటుంబాలకు తప్పకన్యాయం జరిగే విధంగా చూస్తామన్నారు. ప్రజల కోసం పనిచేసేవారికి సమాజంలో ఎప్పటికీ ఆదరణ ఉంటుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ తెలంగాణ ప్రభుత్వ పథకాలు అందేవిధంగా చూస్తామన్నారు.
ప్రజాశ్రేయస్సు కోసం నిరంతరం శ్రమిస్తామని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్, నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్‌రెడ్డి, బన్నాల ప్రవీణ్, డివిజన్ అధ్యక్షుడు పల్లె నర్సింగ్‌రావు, ఉప్పల్ డివిజన్ అధ్యక్షుడు వేముల సంతోష్‌రెడ్డి, ఏదుల కొండల్‌రెడ్డి, పిట్టల నరేశ్, వీబీ నర్సింహ, కొంపెల్లి రవీందర్, కొంపెల్లి రాజ్‌కుమార్, రవీందర్‌రెడ్డి, మహబూబ్, అబ్బుబాయ్, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అదేవిధంగా చిలుకానగర్ డివిజన్‌కు చెందిన సందేపల్లి శ్రీనివాస్‌కు మంజూరైన దళితబంధు పథకంలో భాగంగా కిరాణం అండ్ రైస్ ట్రేడర్స్‌ను ఎమ్మెల్యే, కార్పొరేటర్ ప్రారంభించారు.