దుండిగల్, ఆగస్టు 21 : బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు శంభీపూర్‌రాజు అన్నారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, మల్లంపేటలో శ్రావణమాసాన్ని పురస్కరించుకుని గడిలమైసమ్మ బోనాల ఉత్సవాల్లో ఆయన పాల్గొ న్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో జిల్లా గ్రంథా లయ సంస్థ చైర్మన్ నాగరాజు యాదవ్, బౌరంపేట పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్‌రెడ్డి, కౌన్సిలర్లు శంభీపూర్కృష్ణ, నర్సారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, అర్కల అనంతస్వామి, టీఆర్ఎస్ దుండిగల్ మున్సిపాలిటీ మహిళా విభాగం అధ్యక్షురాలు మనోజతో పాటు స్థానిక నేతలు, ప్రజలు పాల్గొన్నారు.
కార్పొరేషన్ పరిధి, బాచుపల్లి ఇంద్రన్న కాలనీలోని పోచమ్మ ఆలయం, రాజీవ్‌గాంధీనగర్‌లోని ముత్యాలమ్మ దేవాలయం, పోచమ్మ ఆలయాల్లో జరిగిన బో నాల ఉత్సవాలకు మేయర్ కొలన్ నీలాగోపాల్‌రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత టీఆర్ఎస్ ప్రభుత్వం బోనాల ఉత్సవాలకు నిధులు మంజూరు చేస్తున్నదని పేర్కొన్నారు. కార్య క్రమంలో నిజాంపేట కార్పొరేషన్ టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ ఆగం పాండుముదిరాజ్, కార్పొరేటర్ చిట్ల దివాకర్, కో-ఆప్షన్ సభ్యుడు సయ్యద్ సలీం, నాయకులు కాసాని వీరేశ్ముదిరాజ్, చంద్రగిరి సతీశ్, కార్పొరేషన్ టీఆర్ఎస్ యూత్ ప్రసిడెంట్ ప్రవీణ్, ప్రధాన కార్యదర్వి దండుగుల స్వామి, రామ్మోహన్‌రెడ్డి, సందీప్, పరమేశ్‌నాయక్, కృష్ణ, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.