దుండిగల్, ఆగస్టు 21 : పర్యావరణ పరిరక్షణకు మొ క్కల పెంపకం ఎంతో అవసరమని కుత్బుల్లాపూర్ ఎమ్మె ల్యే కేపీ వివేకానంద్ అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం జీడిమెట్ల డివిజన్, మీనాక్ష్మి ఎస్టేట్‌లో నిర్వ హించిన వనమహోత్సవం(హరితహారం)లో పాల్గొని స్థానికులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో వార్డు కమిటీ సభ్యుడు సు ధాకర్గౌడ్, నియోజకవర్గం టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు సోమేశ్యాదవ్, సూరారం డివిజన్ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్, సీనియర్ నాయకులు కుంట సిద్ధిరాములు, నరేందర్‌రెడ్డితో పాటు కాలనీ సంక్షేమ సంఘం నేతలు, మహిళా నాయకులు పాల్గొన్నారు.
డివిజన్ విశ్వకర్మ కాలనీలో జరిగిన హరితహారం కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మంత్రి స త్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులతో కలిసి మొక్కలు నాటి నీరుపోశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎం తో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ అ ధ్యక్షుడు జీవన్‌రెడ్డి, కాలనీ సెక్రటరీ సదానందం, కమిటీ సభ్యులు నర్సింహ, వెంకట్, రాములు, వాసుగుప్తా, ర ఘుపతిరెడ్డి, వార్డు మెంబర్ సరస్వతి, యూజీడీ విభాగం అధికారులు రాజే శ్, శ్యామ్, శంకర్, సీఓ కనకమల్లు, క్లస్టర్ ఇన్చార్జి కిశోర్, తదితరులు పాల్గొన్నారు.
సుభాశ్‌నగర్ డివిజన్ రాజ్యలక్ష్మినగర్‌లో జరిగిన హరితహారం కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గుడిమెట్ల హేమలతసురేశ్రెడ్డి స్థానికులతో కలిసి మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ.. రానున్న రోజుల్లో డివిజన్ పరిధిలో లక్ష మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. స్థానిక మహిళలు పాల్గొన్నారు.