కేపీహెచ్‌బీ కాలనీ, ఆగస్టు 21 : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని.. మొక్కలు నాటి సంరక్షించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం వన మహోత్సవంలో కేపీహెచ్‌బీ కాలనీలో మొక్కలు నీరు పోశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వజ్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకోవాలని.. ప్రతి ఒక్కరిలో స్వాతంత్ర, సమైక్య స్ఫూర్తిని నింపేలా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నదన్నారు. నేడు వన మహోత్సవంలో భాగంగా నియోజకవర్గంలో లక్షలాది మొక్కలను నాటడం సంతోషకరమన్నారు. నగరంలో పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించాలంటే మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలన్నారు.
కళాకారులకు సన్మానం..
స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా కేపీహెచ్‌బీ కాలనీ 6వ ఫేజ్‌లోని పీవీ నర్సింహరావు పార్కులో ఆదివారం ఉదయరాగం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్ మందడి శ్రీనివాస్‌రావులు కళాకారులను సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వేణుగానంతో ప్రజల్లో స్వాతంత్ర స్ఫూర్తిని నింపడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మందడి శ్రీనివాస్‌రావు, మూసాపేట సర్కిల్ ఉప కమిషనర్ కె.రవికుమార్, డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కృష్ణారెడ్డి, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
వజ్రోత్సవం.. వన మహోత్సవం
స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా చేపట్టిన వన మహోత్సవం విజయవంతమైంది. కాలనీలు బస్తీలలో జీహెచ్ఎంసీ అధికారులు, కార్పొరేటర్లు, స్థానికులు మొక్కలు నాటి నీరు పోశారు. కూకట్పల్లి ప్రశాంత్‌నగర్‌లో కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ హరితహారాన్ని చేపట్టినట్లు తెలిపారు. వజ్రోత్సవాల్లో సైతం పెద్ద ఎత్తున మొక్కలు నాటడం సంతోషకరమన్నారు. మొక్కలు నాటి కాపాడుకునే ఉద్యమంలో అందరూ భాగస్తులు కావాలని కోరారు. కార్యక్రమంలో ప్రాజెక్టు ఆఫీసర్ ప్రభాకర్, సీఈవో సుజాత, స్థానిక నేతలు శ్రీధర్ రెడ్డి, జానకి, మీన, పద్మ, శంకర్, వెంకట్‌రెడ్డి, జైహింద్, కృష్ణ, ప్రమీల, లక్ష్మి, స్వాతి, రాణి ఉన్నారు.
మూసాపేటలో..
వనమహోత్సవంలో మూసాపేట డివిజన్ భరత్‌నగర్ శివసేన గ్రౌండ్లో పట్టణ ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ పద్మనాభం మహిళా సంఘాలతో కలిసి మొక్కలు నాటారు. కూకట్పల్లి జోన్ పరిధిలో సర్కిల్‌కు లక్ష చొప్పున ఐదు లక్షల మొక్కలను నాటుతున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలను భాగస్తులను చేస్తూ హరితహారాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కో ఆర్డినేటర్ మురళీ, శ్రవణ్, మహిళా సంఘాల సభ్యులున్నారు.
మొక్కలు నాటిన కార్పొరేటర్లు, డీసీ
బాలానగర్: ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్లో కూకట్పల్లి ఉప కమిషనర్ రవీందర్ కుమార్‌తో కార్పొరేటర్ ముద్దం నర్సింహయాదవ్ కలిసి పలు ప్రాంతాలలో మొక్కలు నాటి నీరు పోశారు. బాలానగర్‌లో కార్పొరేటర్ ఆవుల రవీందర్‌రెడ్డి, డీసీ రవీందర్ కుమార్‌లు కలిసి మొక్కలు నాటి నీరు పోశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కర్రె జంగయ్య, బుర్రి యాదగిరి, కల్యాణినగర్ అసోసియేషన్ అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, అంబటి సునిల్‌కుమార్, ఎండీ ఖాజా, డీ కృష్ణమూర్తి, శ్రీనివాస్ ముదిరాజ్, నాగేందర్‌గౌడ్, శేఖర్‌రెడ్డి, కవిత, కలకుంట్ల స్వాతి, భారతి, లక్ష్మి, షాహిదా బేగం, చింతల జ్యోతి, ప్రసన్న, అరుణ తదితరులు పాల్గొన్నారు.