బడంగ్‌పేట/ఆర్కేపురం/కందుకూరు, ఆగస్టు 20: మునుగోడులో ప్రజా దీవెన భారీ బహిరంగ సభకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో మహేశ్వరం నియోజకవర్గం నుంచి 150 కార్లతో నాయకులు భారీగా ర్యాలీగా తరలివెళ్లారు. బడంగ్‌పేట, మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ అధ్యక్షులు రామిడి రాంరెడ్డి, కామేశ్‌రెడ్డి, మహేశ్వరం మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు రాజూనాయక్, తుక్కుగూడ, జల్పల్లి మున్సిపాలిటీ టీఆర్ఎస్ అధ్యక్షులు లక్ష్మయ్య, ఇక్బాల్ బిన్ ఖలీఫా ఆధ్వర్యంలో కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు మంత్రి వెంట వెళ్లారు.
ప్రజాదీవెన సభకు తరలివెళ్లిన వారిలో ఆర్కేపురం డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల నాగేశ్, మహేశ్వరం నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్‌శర్మ, నియోజకవర్గం యూత్వింగ్ అధ్యక్షుడు లోకసాని కొండల్‌రెడ్డి, మాజీ డివిజన్ అధ్యక్షుడు ఇంటూరి అంకిరెడ్డి, మహిళా అధ్యక్షురాలు లిక్కి ఊర్మిలారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, కొండ్ర శ్రీనివాస్, సాజీద్, సిద్దగోని వెంకటేశ్‌గౌడ్, ముప్పిడి లింగస్వామిగౌడ్, మహేందర్‌యాదవ్, పెంబర్తి శ్రీనివాస్, జగన్, గిరినందన్గౌడ్, మురళీధర్‌రెడ్డి, మారం సుజాతారెడ్డి, ఎండీ.సలీం, రిషి తదితరులు ఉన్నారు.
కందుకూరు మండల కేంద్రంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్ సురుసాని సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో వాహనాల్లో తరలి వెళ్లి పెద్ద అంబర్‌పేట వద్ద సీఎం కేసీఆర్ కాన్వాయ్ వెంబడి ర్యాలీగా వెళ్లారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, కృష్ణరాంభూపాల్‌రెడ్డి, కాకి దశరథ ముదిరాజ్, సర్పంచ్‌లు గంగాపురం గోపాల్‌రెడ్డి, పరంజ్యోతి, కాసుల రామకృష్ణారెడ్డి, ఎర్రబైరు సదాలక్ష్మీ పుల్లారెడ్డి, జ్యోతీ చంద్రశేఖర్, లచ్చానాయక్, సుమన్, ఆనేగౌని దామోదర్‌గౌడ్, అమరేందర్‌రెడ్డి, ఈశ్వర్‌గౌడ్, గంగాపురం లక్ష్మీనర్సింహారెడ్డి, డైరెక్టర్లు ప్రకాశ్‌రెడ్డి, రాయిచెట్టు యాదయ్య, శేఖర్‌రెడ్డి, బాలమల్లేశ్, దేవీలాల్, సభకు వెల్లిన వారిలో ఉన్నారు.