శంషాబాద్ రూరల్, ఆగస్టు 20 : మునుగోడు నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా దీవెన సభకు శంషాబాద్ మండలాధ్యక్షుడు చంద్రారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు 200 వాహనాల్లో తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని తెలిపారు. తరలివెళ్లిన వారిలో గణేశ్‌గుప్తా, ఎన్ఎంసీ చైర్మన్ వెంకటేశ్ గౌడ్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు దండుఇస్తారి, సర్పంచ్‌లు సతీశ్‌యాదవ్, దేవానాయక్, రాంగోపాల్, రమేశ్‌యాదవ్, కౌన్సిలర్లు అమృతారెడ్డి, అజేయ్, కుమార్‌లతో పాటు పార్టీ నాయకులు నీరటి రాజు, శ్రీనివాస్ ఉన్నారు.
మలక్‌పేట/సైదాబాద్/చాదర్‌ఘాట్, ఆగస్టు 20: టీఆర్ఎస్ పార్టీ యాకుత్‌పురా నియోజకవర్గం ఇన్చార్జి సామ సుందర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మునుగోడు ప్రజా దీవెన బహిరంగ సభకు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని సింగరేణికాలనీ నుంచి టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్త ఎత్తున ర్యాలీగా మునుగోడుకు తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు ప్రజానీకం ఎంతో చైతన్యం కలిగిన ప్రజలు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిని భారీ మెజార్టీతో గెలిపించటం ఖాయమన్నారు. బీజేపీ పార్టీ తమ స్వార్ధం కోసం ఉప ఎన్నికను తీసుకుని వచ్చిందని, ఆ పార్టీ నాయకుడు తమ అక్రమ ఆస్తులను కాపాడుకోవటానికి ఎన్నికలను తెచ్చాడన్నారు. రాష్ట్రంలో ఉత్తమ పరిపాలన కొనసాగిస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుఖాయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎస్ సదన్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సామ స్వప్నారెడ్డి, డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మెట్టు భాస్కర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు విక్రమ్, రమావత్ చందునాయక్, వెంకటేశ్, హోటల్ శ్రీను, రమేశ్, గోపాల్, కేశ్యనాయక్ తదితరులు పాల్గొన్నారు.
మునుగోడు మండల కేంద్రంలో నిర్వహించనున్న ప్రజా దీవెన సభకు మలక్‌పేట నుంచి టీఆర్ఎస్ నాయకులు పలు వాహనాల్లో తరలివెళ్లారు. హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్‌కమిటీ చైర్పర్సన్ అనితా నాయక్ ఆధ్వర్యంలో మార్కెట్ డైరెక్టర్లతోపాటు మూసారాంబాగ్ డివిజన్ నాయకులు ప్రజా దీవెన సభకు తరలివెళ్లారు. ఈ సందర్భంగా అనితా నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు నిర్వహించినా గెలుపు మాత్రం టీఆర్ఎస్దేనని అన్నారు. సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో కొనసాగుతున్న పాలన దేశానికే మార్గదర్శకంగా నిలిచిందన్నారు. ప్రతిపక్షాలు ఎంత గగ్గోలుపెట్టినా గెలుపు మాత్రం టీఆర్ఎస్దేనని ధీమా వ్యక్తం చేశారు.
ప్రజా దీవెన సభకు మలక్‌పేట నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. శనివారం ఆజంపురాలోని పార్టీ కార్యాలయం లో మునుగోడు ప్రజా దీవెన సభకు సంబంధించిన వాల్ పోస్టర్లను నియోజకవర్గం ఇన్చార్జి ఆజం అలీ ఆవిష్కరించారు. అనంతరం జెండా ఊపి వాహనాల ర్యాలీను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆజం అలీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధీటుగా దేశంలో ఏ ముఖ్యమంత్రి లేడని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలన్నింటినీ మిగతా రాష్ర్టాలు, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాలు కాపీ కొడుతున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.