జీడిమెట్ల, ఆగస్టు 19 : ఓ పరిశ్రమలో ప్రమాదవశాత్తు మూడేండ్ల బాలుడు ఆల్కాహాల్ సంపులో పడి చనిపోయాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ గౌతమ్ తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన రామ్ జీడిమెట్ల ఐడీఏ ఫేజ్ -1లోని రాజ్‌కమల్ ల్యాబ్స్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. అక్కడే కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. మంగళవారం రామ్ కుమారుడు రాజ్‌కుమార్ ఆడుకుంటూ గది నుంచి బయటకు వచ్చి కనిపించకుండాపోయాడు. తల్లి చుట్టూ పక్కల వెతికినా.. ఫలితం లేకుండాపోయింది. అనుమానం వచ్చి రామ్.. కంపెనీ ఆవరణలోని ఆల్కాహాల్ నిల్వ చేసే సంపుపై మూతలేకపోవడంతో అందులో వెతకగా, బాలుడు కనిపించాడు. బయటకు తీసి చూడగా, అప్పటికే మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.