సిటీబ్యూరో, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): కేసుల ఛేదనలో టాస్క్‌ఫోర్స్ పోలీసుల పనితీరు భేష్ అని సీపీ సీవీ ఆనంద్ అన్నారు. వ్యవస్థీకృత నేరాలను పూర్తిస్థాయిలో కట్టడి చేయడంలో మరింత చురుకుగా పనిచేయాలని సూచించారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని టీఎస్ఐపీసీసీసీలో నగర కమిషనరేట్‌లోని ఐదు జోన్ల టాస్క్‌ఫోర్స్ బృందాలతో సీపీ సమీక్ష నిర్వహించారు. వివిధ అంశాలపై చర్చించారు. టాస్క్‌ఫోర్స్ 1020 కేసులను ఛేదించి, 2087 మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. అనంతరం గణేశ్ నవరాత్రులు, నిమజ్జన కార్యక్రమాల బందోబస్తుపై సీపీ చర్చించారు.