కేపీహెచ్‌బీ కాలనీ/బాలానగర్/మూసాపేట, ఆగస్టు 18: పీడిత ప్రజలకు రక్షణగా పాలితులపై పోరాటం చేసిన అసమాన వీరుడు సర్దార్ సర్వాయిపాపన్న గౌడ్ అని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నా రు. గురువారం సర్దార్ సర్వాయిపాపన్న గౌడ్ 372వ జయంతి సందర్భంగా కూకట్‌పల్లిలోని పాపన్నగౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ.. సబ్బండ వర్గాలకు అండగా నిలబడి పాలకుల నిరంకుశత్వాన్ని నిలదీసి పేదల పెన్నిదిగా నిలిచాడన్నారు. తెలంగాణ అస్తిత్వ పోరాటంలో యోధుడుగా నిలిచిన సర్దార్ సర్వాయిపాపన్న గౌడ్ చరిత్రను గత పాలకులు మరిచిపోయారన్నారు. పేదలకోసం పోరాడిన మహనీయుడి త్యాగాలను భావితరాలు తెలుసుకోవాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పాపన్న గౌడ్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నారన్నారు. పాపన్న గౌడ్ లాంటి వీరుల త్యాగాలను స్మరించుకుని.. వారి ఆశయాలను సాధించే దిశగా ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు గౌసుద్దీన్, కూకట్పల్లి గౌడ సంఘం నేతలు పాల్గొన్నారు.
సర్దార్ సర్వాయి పాపన్న ఆశయ సాధనకు కృషి చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. గురువారం బాలానగర్‌లో నూతనంగా ఏర్పా టు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేటి యువత పాపన్న ఆశాయాలకు ఊపిరిపోయాలన్నారు. కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు కూన రవీందర్‌గౌడ్, శ్రవన్కుమార్గౌడ్, శ్రీకాంత్పటేల్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కూకట్‌పల్లిలో సర్దార్ సర్వాయిపాపన్న గౌడ్ విగ్రహానికి రాష్ట్ర టెక్నాలజీస్ సర్వీసెస్ కార్పొరేషన్ చైర్మన్ పాటిమీది జగన్మోహన్రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కూకట్పల్లి గ్రామ గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయిపాపన్న గౌడ్ 372వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సర్వాయిపాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జి.నర్సింహా గౌడ్, సీహెచ్.శ్రీనివాస్ గౌడ్, తేళ్ల హరికృష్ణ, నర్సింగరావు, నవీన్ గౌడ్, విష్ణు గౌడ్, సంతోష్ గౌడ్, లలిత, జయశ్రీ, తదితరులున్నారు.
గురువారం మూసాపేట డివిజన్ పరిధి జనతానగర్‌లో నిర్వహించిన సర్వాయి పాపన్న జయంతి వేడుకలకు కార్పొరేటర్ మహేందర్ హాజరై పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమం లో మల్లేశ్‌గౌడ్, ఎర్ర స్వామి, మంగమ్మ, నవీన్, ప్రశాంత్‌రెడ్డి, యోగేష్ప్రభూ తదితరులు పాల్గొన్నారు.