వనస్థలిపురం, ఆగస్టు 17: స్వాతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా సీఎం కేసీఆర్ పిలుపు మేరకు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. వనస్థలిపురం ఏరియా దవాఖానలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్తదానం చేయడం ప్రాణదానంతో సమానమన్నారు. రాష్ట్రంలో రక్తం ఎంతో అవసరం ఉందన్నారు. నిల్వలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దాతలు ముందుకు వచ్చి రక్తదానం చేయాలని సూచించారు. డయాలసిస్, తలసీమియా లాంటి బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత మన సమాజంపై ఉందన్నారు. అనంతరం ఎమ్మెల్యే రక్తదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. కార్యక్రమంలో బీఎన్‌రెడ్డినగర్ కార్పొరేటర్ లచ్చిరెడ్డి, వనస్థలిపురం మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్‌రెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు చింతల రవికుమార్, దవాఖాన సూపరింటెండెంట్ హరిప్రియ, ఆర్ఎంవో రాజు, సీనియర్ నాయకులు కుంట్లూర్ వెంకటేశ్‌గౌడ్, చాపల శ్రీనివాస్ యాదవ్, ఆనంద్‌రాజ్, బొమ్మిడి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హస్తినాపురంలో..
హస్తినాపురం డివిజన్ భూపేష్గుప్తా నగర్లో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కంచర్ల శివారెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కార్పొరేటర్ బానోతు సుజాత హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు అందోజు సత్యం చారి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయ్‌కుమార్‌రెడ్డి, సీనియర్ నాయకులు గోపిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, నారబోయిన శ్రీనివాస్‌యాదవ్, లెంకల శ్రీకాంత్‌రెడ్డి, డేరంగుల కృష్ణ, గోపీసింగ్, రెడ్డిమల్ల పెద్ద కృష్ణ, విష్ణుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలి
చంపాపేట, ఆగస్టు 17: ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని టీఆర్ఎస్ పార్టీ చంపాపేట డివిజన్ అధ్యక్షుడు ముడుపు రాజ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా రాజ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని కర్మన్‌ఘాట్ మాధవనగర్ కాలనీలో బుధవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ముందుగా రాజ్‌కుమార్‌రెడ్డి రక్తదానం చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వర్, మహిళా విభాగం అధ్యక్షురాలు శాగ రోజారెడ్డి, నాయకులు రమాదేవి, వసంతరెడ్డి, నిష్కాంత్రెడ్డి, గోగు శేఖర్‌రెడ్డి, సత్యప్రకాశ్, భానుప్రకాశ్‌రెడ్డి, గూడూరు గౌతంరెడ్డి, సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగులకు ఆసరాగా..
మన్సూరాబాద్, ఆగస్టు 17: స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ హోల్డర్, సామాజిక కార్యకర్త డాక్టర్ పెండెం కృష్ణకుమార్ పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్ననారు. ఇందులో భాగంగా బుధవారం వనస్థలిపురంలోని శాంతినికేతన్ మానసిక వికలాంగుల ఫౌండేషన్ సంస్థకు నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.