మణికొండ/ బండ్లగూడ/శంషాబాద్ రూరల్/అత్తాపూర్/మైలార్‌దేవ్‌పల్లి/వ్యవసాయ విశ్వవిద్యాల యం, ఆగస్టు 16: దేశ పౌరులుగా ప్రతి ఒక్కరూ స్వాతంత్య్ర సమర యోధులను గుర్తించుకోవాల్సిన అవసరం ఉందని ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నారు. రాజేంద్రనగర్ నియోజక వర్గంలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఘనంగా వజ్రోత్సవాలను నిర్వహించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏసీపీ గాంగధర్, ఇన్స్పెక్టర్ నాగేంద్రబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక గీతాలాపన కార్యక్రమానికి ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, శంషాబాద్ జోన్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి గీతాలాపన చేశారు.
ఎంపీ రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ ఎంతో మంది పోరాటం చేసి దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చారన్నారు. ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పిలుపు మేరకు రాజేంద్రనగర్ పోలీసులు గీతాలాపన నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో విశ్వవిద్యాయలం రిజిస్ట్ట్రార్ సుధీర్‌కుమార్,వెటర్నరీ వీసీ రవీందర్‌రెడ్డి, ఉద్యానవన ఇన్చార్జి అసోసియేట్ డీన్ ప్రశాంత్, కార్పొరేటర్ అర్చన జయప్రకాశ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నార్సింగి పోలీస్ స్టేషన్ల ఆధ్వర్యంలో మైహోం వద్ద జాతీయగీతాలపన కార్యక్రమంలో మూడు వేల మంది పాల్గొన్నారు.
దేశభక్తి ఉప్పొంగింది. ప్రభుత్వం పిలుపుమేరకు ఉదయం 11.30 గంటలకు గీతాలాపన చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో శంషాబాద్‌లో ప్రజాప్రతినిధులు, అధికారులు ఎక్కడిక్కడే జాతీయ గీతాన్ని ఆలపించారు. శంషాబాద్ మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ జయమ్మ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి జాతీయగీతాన్ని ఆలపించారు. దీంతో పాటు శంషాబాద్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పోలీసుల ఆధ్వర్యంలో గీతాలాపన చేశారు.
శంషాబాద్‌లో ఎయిర్‌పోర్టు గీతాలాపన చేశారు. శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులు, సీఐఎస్ఎఫ్, ఎయిర్‌పోర్టు అధికారుల ఆధ్వర్యంలో రెండు వేల మందితో కలిసి జాతీయగీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, పలువురు ఎస్ఐలు పాల్గొన్నారు.
అత్తాపూర్ డివిజన్లో యువకులు, రాజకీయ నాయకులు జాతీయ జెండాలను చేతబట్టి సాముహిక గీతాలాపన చేశారు. అత్తాపూర్, హైదర్‌గూడ, పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నంబర్ 143, నందిముస్లాయిగూడ చౌరస్తాలో గీతాలాపన చేశారు.
దేశం కోసం పోరాడిన మహనీయులను మరవకుండా వారి ఆశయ సాధనకు కృషి చేయాలని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ సూచించారు. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో సామూహిక గీతాలాపన నిర్వహించారు. కాటేదాన్ చౌరస్తాలో ప్రజలు,విద్యార్థులు,వాహన దారులు ఇన్స్పెక్టర్ నర్సింహ ఆధ్వర్యంలో గీతాలాపన చేశారు. దుర్గానగర్‌లోని దుర్గాకన్వెన్షన్లో మాజీ కార్పొరేటర్ ప్రేమ్‌దాస్‌గౌడ్ ప్రజలతో కలిసి గీతాలాపన చేశారు. కార్యక్రమంలో ఎస్ఐ పాల్గొన్నారు.